- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేషనల్ హైవే 44 మూసివేత.. కామారెడ్డి - హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల చెరువు కట్టలు తెగి, పొలాలు కొట్టుకుపోగా... అనేక గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి.

దిశ, వెబ్ డెస్క్/భిక్కనూరు : తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల చెరువు కట్టలు తెగి, పొలాలు కొట్టుకుపోగా... అనేక గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. గత రాత్రి నుంచి ఒక్క కామారెడ్డిలో 49 సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది. రోడ్లు, రైల్వే ట్రాకులు కొట్టుకు పోయాయి. కాగా కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే నేషనల్ హైవే (NH-44) జంగంపల్లి వద్ద భారీ వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో NH-44 మూసివేయబడింది.
వరద నీరు భారీగా హైవేపై పొంగి ప్రవహిస్తుండడంతో 8 గంటలుగా కామారెడ్డి జిల్లా భిక్కనూరు హైవేపై పూర్తిగా రాకపోక లు నిలిచిపోయాయి. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. టోల్ ప్లాజా సమీపంలోని పాత ఏడవ నెంబర్ జాతీయ రహదారి మీదుగా భిక్కనూరు మండల కేంద్రంలో నుంచి వాహనాలను సీఐ సంపత్ కుమార్, ఎస్ ఐ లు ఆంజనేయులు నరేందర్ ఆధ్వర్యంలోని పోలీసులు వాహనాలను పంపిస్తూ ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తుండగా, హైవేపై పొంగి ప్రవహిస్తున్న వరద నీటిలో నుంచి హైవేపై నిల్చొని పోలీసులు వాహనాలను పంపిస్తున్నారు.
సుమారు మూడు గంటలుగా పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. హైవేపై రహదారి కనిపించకుండా ఎటు చూసినా వరద నీరే కనిపిస్తుండడంతో ఇదెక్కడి వరద నీరంటు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండుగ కోసం సిటీ ఊళ్ళకు వెళ్లేవారు ట్రాఫిక్ లో ఇరుక్కొని అనేక ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం ఐదున్నర గంటల వరకు కూడా హైవే పై జామైన ట్రాఫిక్ ను మాత్రం పోలీసులు క్రమంగా క్లియర్ చేస్తున్నారు.






