- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేషనల్ హెరాల్డ్ కేసులో కక్ష సాధింపు రాజకీయాలు : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఫిర్యాదును కోర్టు కొట్టేసిందని, కేసులో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు, ట్రాన్సాక్షన్లు లేవని కోర్టు స్పష్టం చేసిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఫిర్యాదును కోర్టు కొట్టేసిందని, కేసులో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు, ట్రాన్సాక్షన్లు లేవని కోర్టు స్పష్టం చేసిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై కక్ష సాధింపు రాజకీయాలే లక్ష్యంగా ఈడీ కేసు నమోదు చేసిందని, బీజేపీ ప్రభుత్వమే ఈడీ, సీబీఐ, ఈసీ వంటి సంస్థలను రాజకీయ ఆయుధాలుగా వాడుతోందని ఆయన ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రాపర్టీ ట్రాన్స్‌ఫర్ గానీ, అక్రమ ఆస్తుల గానీ లేవని, కోర్టు ఈడీకి చివాట్లు పెట్టి ఇలాంటి కేసులు పెట్టొద్దని హెచ్చరించిందన్నారు.
స్వతంత్ర సంస్థలను పార్టీ ప్రయోజనాల కోసం వాడొద్దని స్పష్టమైన సందేశం ఇచ్చిందని, కాంగ్రెస్ నేతలపై తప్పుడు కేసులతో ప్రజల్లో అపనమ్మకం సృష్టించే ప్రయత్నం జరుగుతోందని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈడీ చర్యల వెనుక బీజేపీ రాజకీయ దురాలోచన బయటపడిందని, ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో 2005లో ఉపాధి హామీ పథకం ప్రారంభం అయిందని, ఇప్పుడు పథకం పేరు మార్చి విక్సిత్ భారత్ – జీ రామ్ జీగా నామకరణం చేశారని చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
మహాత్మా గాంధీ పేరు తొలగించడం ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆలోచనకు నిదర్శనమని, పథకాన్ని బలపర్చకుండా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర నిధుల వాటా 40:60గా మార్చడంతో రాష్ట్రాలపై భారం పెరిగిందని, రాష్ట్రాలకు నిధులు లేకపోతే పథకం అమలు కష్టమయ్యే పరిస్థితి లేదన్నారు. పేదలు, దళితులు, మైనారిటీల సంక్షేమాన్ని పట్టించుకోని వైఖరి కేంద్రానిదని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ తీసుకొచ్చిన పథకాల మూలసూత్రాలను బీజేపీ చెరిపేస్తోందని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. పథకం మార్పులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేస్తోందని, బీజేపీ,ఆర్ఎస్ఎస్ ఆలోచనా విధానం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, పేదల ఉపాధి హక్కును కాపాడేందుకు ప్రజలు ప్రతిఘటించాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.






