‘బలగం’లోని ‘ఊరు పల్లెటూరు’ పాటకు నేషనల్ అవార్డు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-01 13:16:44  IST  )

2023 సంవత్స‌రానికి జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డుల‌ను జ్యూరీ ప్ర‌క‌టించింది. అందులో తెలంగాణ చిత్ర బ‌ల‌గంకు సైతం అవార్డు ద‌క్కింది.

‘బలగం’లోని ‘ఊరు పల్లెటూరు’ పాటకు నేషనల్ అవార్డు
X

దిశ‌, వెబ్ డెస్క్: 2023 సంవత్స‌రానికి జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డుల‌ను జ్యూరీ ప్ర‌క‌టించింది. అందులో తెలంగాణ చిత్రం బ‌ల‌గంకు సైతం అవార్డు ద‌క్కింది. బ‌లగం సినిమాలోని ఊరు ప‌ల్లెటూరు పాట‌కు గాను బెస్ట్ లిరిక్స్ అవార్డు ద‌క్కింది. ఈ పాట‌ను కాస‌ర్ల శ్యామ్ రాయగా సింగర్ మంగ్లీ, రామ్ మిరియాల కలిసి పాడారు. శ్రోతలను ఎంతగానో మెప్పించిన ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేసింది. సినిమా విడుదలైన తరవాత ప్రతి ఒక్కరి నోటి నుండి ఇదే పాట వినిపించింది. పల్లెటూరి గొప్పదనాన్ని వివరిస్తూ ఉన్న లిరిక్స్‌కు ప్రజలు ఫిదా అయ్యారు. ఇక ఈ చిత్రానికి వేణు టిల్లు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టించారు. సినిమాలో ప్రియ‌ద‌ర్శికి జోడీగా కావ్య హీరోయిన్‌గా న‌టించింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షలను ఎంతగానో ఆకట్టుకుంది.

Next Story