Hari Chandana: అది కేవలం వైద్య సమస్య మాత్రమే కాదు

by Gantepaka Srikanth |

ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ (ఏసీడీ)పై అవగాహన, సమగ్ర విధాన మార్పులే లక్ష్యంగా హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్‌లో శనివారం నేషనల్ ఆటిజం స్టేక్‌హోల్డర్స్ సమ్మిట్-2026 ఘనంగా ప్రారంభమైంది.

Hari Chandana: అది కేవలం వైద్య సమస్య మాత్రమే కాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ (ఏసీడీ)పై అవగాహన, సమగ్ర విధాన మార్పులే లక్ష్యంగా హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్‌లో శనివారం నేషనల్ ఆటిజం స్టేక్‌హోల్డర్స్ సమ్మిట్-2026 ఘనంగా ప్రారంభమైంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెల్లెక్టువల్ డిసెబిలిటీస్ () సహకారంతో రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సును హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆటిజం కేవలం వైద్య సమస్య మాత్రమే కాదని, మానవ మేధస్సు వైవిధ్యానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. విద్య, ఉపాధి రంగాల్లో న్యూరోడైవర్సిటీని ప్రోత్సహించేలా సమగ్ర విధానాలు అమలు కావాలని ఆకాంక్షించారు. అనంతరం ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ (సీడీసీ)ని ఆమె ప్రారంభించారు.

ఆటిజాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించాలని, ప్రారంభ దశలో గుర్తింపు, నాణ్యమైన చికిత్స ద్వారా మెరుగైన ఫలితాలు సాధ్యమని యశోద హాస్పిటల్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ ఎ. లింగయ్య తెలిపారు. తొలిదశలో అందించే వైద్యం పిల్లల జీవన నాణ్యతను పెంచుతుందని ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ లోకేష్ లింగప్ప వివరించారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 500 మందికి పైగా న్యూరో సైంటిస్టులు, పీడియాట్రిక్ నిపుణులు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎన్ఐఈపీఐడీ డైరెక్టర్ డాక్టర్ బి.వి. రామ్ కుమార్, వైద్య నిపుణులు డాక్టర్ అమూల్య మైసూర్, డాక్టర్ సారా బైలూర్, డాక్టర్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story