ఇరుకైన భవనమే మృతులు పెరగడానికి కారణమైందా ..?

by Bhanu |

చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్ చౌక్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడంలో ఇరుకైన భవనమే కారణమైందా ? అంటే అధికారులు అవుననే సమాధానం ఇస్తున్నారు .

ఇరుకైన భవనమే మృతులు పెరగడానికి కారణమైందా ..?
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్ చౌక్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడంలో ఇరుకైన భవనమే కారణమైందా ? అంటే అధికారులు అవుననే సమాధానం ఇస్తున్నారు . జీ ప్లస్ టూ పద్ధతిలో నిర్మించిన ఈ భవనానికి పైకి వెళ్లేందుకు, క్రిందకు వచ్చేందుకు ఒకే దారి ఉంది. మంటల కారణంగా దట్టమైన పొగ వ్యాపించడం , అంతకంతకు మంటలు పెరడగంతో నిద్రలో ఉన్న వారికి ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చివరకు అర్ధమయ్యే సరికి కిందకు వచ్చే దారులు పొగ, అగ్నితో మూసుకుపోయాయి . దీంతో భవనంలో చిక్కుకున్న వారికి ఏం చేయాలో పాలుపోలేదు. ఈ నేపథ్యంలో అధికారులు భవనం గోడలు కూలగొట్టి అలుముకున్న పొగను బయటకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం లోపల చిక్కుకుపోయిన వారిని కిందకు తీసుకువచ్చే ప్రయత్నం చేయగా అప్పటికే ముగ్గురు సజీవ దహనం అయ్యారు . మిగిలిన 18 మందిని సమీపంలోని పలు ఆస్పత్రులకు తరలించారు . అయితే చికిత్స పొందుతూ వీరిలో 14 మంది చనిపోయారు. మృతులతో పాటు గాయపడిన వారు 21 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.

Next Story