- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయిన ప్రముఖ నటుడు.. కారణం ఇదేనా?
by Muthe.Rajitha |
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ తెలుగు నటుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి సోదరుని కుమారుడు నారా రోహిత్ సమావేశం అయ్యారు.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ తెలుగు నటుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి సోదరుని కుమారుడు నారా రోహిత్ సమావేశం అయ్యారు. ఈనెల 30న జరిగే తన వివాహానికి రావాలని నారా రోహిత్.. సీఎం రేవంత్ ను ఆహ్వానించారు. కాగా నటి, ప్రియురాలు అయిన శిరీషను నారా రోహిత్ ఈనెల 30న పెళ్లి చేసుకోబుతున్న సంగతి తెలిసిందే. రేపటి నుంచి మొదలయ్యే హల్దీ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 26న పెళ్ళికొడుకు వేడుక, 28న మెహేంది వేడుక జరగనుండగా.. 30న రాత్రి 10.35 గంటలకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో వీరి వివాహం జరగనుంది.
వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తీ కాగా.. ఈ వేడుకలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సహా, పలువురు మంత్రులు, అన్ని పార్టీల ముఖ్య నేతలు, పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.
Next Story






