- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల సమన్వయకర్తగా నంగి దేవేందర్ రెడ్డి
by Malleboina Mahesh |
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గానికి చెందిన నంగి దేవేందర్ రెడ్డిని టీపీసీసీ ఎన్నారై సెల్ విభాగంలో అంతర్జాతీయ వ్యవహారాల సమన్వయకర్తగా నియమిస్తూ టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ డా.. బీఎం వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గానికి చెందిన నంగి దేవేందర్ రెడ్డిని టీపీసీసీ ఎన్నారై సెల్ విభాగంలో అంతర్జాతీయ వ్యవహారాల సమన్వయకర్తగా నియమిస్తూ టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ డా.. బీఎం వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దేవేందర్ నియామకం ఆదివారం నుండే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు అయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్భంగా నంగి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకంతో ఈ పదవిని కట్టబెట్టినందుకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎన్నారై సెల్ చైర్మన్ వినోద్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరింప చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.
Next Story






