- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Iron Sculptures: జీవకళ ఉట్టిపడేలా బసవన్న విగ్రహం.. యువ కళాకారిణి నందిత అద్భుత సృష్టి
కాదేది కళకు అనర్హం అన్నట్లుగా కొంత మంది విగ్రహాలు, ప్రతిమలు, వస్తువుల తయారీలో వినూత్న ఆలోచనలతో రూపొందిస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాదేది కళకు అనర్హం అన్నట్లుగా కొంత మంది విగ్రహాలు, ప్రతిమలు, వస్తువుల తయారీలో వినూత్న ఆలోచనలతో రూపొందిస్తున్నారు. ఇనుము, ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను పునర్వినియోగిస్తూ జీవకళ ఉట్టిపడేలా ఐరన్ (sculptures) శిల్పాలను కొంత మంది కళాకారులు తయారు చేస్తున్నారు. ఈ కోవకు చెందిన ఓ యువ కళాకారిణి తన అద్భుత ప్రతిభతో వివిధ రూపాలను సృష్టిస్తోంది. (Madhya Pradesh) మధ్యప్రదేశ్‌కు చెందిన (Nandita Tiwari) నందితా తివారీ.. ఇనుప వ్యర్థాలతో ఇటీవల తయారు చేసిన బసవన్న విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది.
బాల్యం నుంచి కళలపై ఆసక్తి ఉన్న నందిత.. (Fine Arts) ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. మట్టి విగ్రహాలు, రాతి శిల్పాలు చెక్కడంలో నందిత నేర్పరి. ఈ నేపథ్యంలో గుర్తుండిపోయేలా ఒక విగ్రహం తయారు చేయాలనే పట్టుదలతో నందిత.. జబల్‌పుర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పోగుబడి ఉన్న ఇనుప వ్యర్థాలను సేకరించారు. నెల రోజుల పాటు శ్రమించి సుమారు 500 కిలోల బరువున్న బసవన్న విగ్రహాన్ని ఆకర్షణీయంగా మలిచారు. దాదాపు నంది ఎత్తు ఏడు అడుగులు, పొడవు 8 అడుగుల కంటే ఎక్కువగా ఉంటుందని కళాకారిణి నందితా తివారీ తెలిపారు. ఈ నందికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సందర్భంగా నందిత తివారీ కళలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇలాంటి ప్రతిభ ఉన్న వారిని ప్రభుత్వాలు ప్రోత్సహించాలని నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తున్నారు.






