- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిందీ భాష పెద్దమ్మ ఎలా అవుతుంది? పవన్‌పై ప్రముఖ రచయిత ఫైర్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై ప్రముఖ రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై ప్రముఖ రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ హిందీ పెద్దమ్మ లాంటిదని, తెలుగు తల్లి లాంటిది అంటున్నాడని మరి ఇంగ్లీష్ పెద్ద పెద్దమ్మనా? అని ప్రశ్నించారు. అలా అనుకుంటే 2వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భాష తెలుగు భాష అని కేవలం 700 సంవత్సరాల చరిత్ర గల భాష హిందీ అని అన్నారు. ముందు పుట్టింది తెలుగు భాషనా, హిందీ భాషనా అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు కేవలం రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఇలా చేస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ తెలుగు వాడు అయ్యిండి ఒక భాషను రుద్దే ప్రయత్నం చేయడానికి కనీసం చరిత్ర అయినా తెలుసుకుని ఉండాలన్నారు.
అంతే కాకుండా రాధాకృష్ణ కొత్త పలుకుల పేరిట రాసిన వ్యాసం లో హెడ్డింగ్ బీఆర్ఎస్ ను రాజకీయంగా విమర్శించినట్లుగా పెట్టి, లోపల తెలంగాణ అస్థిత్వాన్ని అస్థిరపరిచే రాతలు రాశాడన్నారు. చంద్రబాబు చెప్పుచేతల్లో ఉండే పత్రికలు, నాయకులు ఆ దిశగా పావులు కదుపుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ, ఆంధ్ర అనే భావన లేకుండా అందరు సంతోషంగా ఉన్నారంటూ కొత్తపలుకులో రాశారని, తెలంగాణ, ఆంధ్ర భావన లేకుండా సంతోషంగా ఉన్నది కేవలం రాధాకృష్ణ, రేవంత్ రెడ్డి వారి గురువు చంద్రబాబు మాత్రమే అని ఎద్దేవా చేశారు.
ఇప్పుడిప్పుడే ప్రభుత్వం వచ్చింది ఎందుకు మాట్లాడాలి అని మౌనంగా ఉంటే మన లోగోలో కాకతీయ తోరణం మాయమైందని, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయమైందని మండిపడ్డారు. భారత దేశ చిత్రపటంలో తెలంగాణ పటమే తీసేశారని వ్యాఖ్యానించారు. ఇవన్నీ ఏదో అనుకోకుండా జరిగిన ఘటనలు కావని, చాలా పక్కా ఆలోచనలతో కుట్ర పూరితంగా చేసినవే అని అన్నారు. తెలంగాణ వచ్చింది ఇంకెక్కడి తెలంగాణ వాదం అని సమైఖ్య వాదులు అనుకుంటే పొరపాటు అవుతుందన్నారు. తెలంగాణ ప్రాంతీయ అస్థిత్వం మీదనే రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఈ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.






