- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్వకుంట్ల కవితపై నందమూరి అలేఖ్య సంచలన పోస్ట్..!
గులాబీ పార్టీ ( BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై ( Kalvakuntla Kavitha) నందమూరి అలేఖ్య (Nandamuri Alekhya) ఆసక్తికర పోస

దిశ, వెబ్ డెస్క్: గులాబీ పార్టీ ( BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై ( Kalvakuntla Kavitha) నందమూరి అలేఖ్య (Nandamuri Alekhya) ఆసక్తికర పోస్ట్ పెట్టింది. 20 సంవత్సరాలుగా.. తమ స్నేహం కొనసాగుతోందని.. అప్పటినుంచి ఇప్పటివరకు... తమ బంధం మరింత స్ట్రాంగ్ అయిందంటూ సంచలన పోస్ట్ పెట్టింది నందమూరి అలేఖ్య. ఎలాంటి తుఫాన్లు, వివాదాలు, చిన్నచిన్న గొడవలు వచ్చినప్పటికీ తమ బంధం మాత్రం అందరిలా విడిపోలేదని ఆమె పేర్కొన్నారు.
కల్వకుంట్ల కవిత అంటే తనకు అభిమానమని... 20 సంవత్సరాలుగా... ఇద్దరం ఎంతో కలిసిమెలిసి ఉంటున్నామని చెప్పుకొచ్చారు అలేఖ్య. ఈ బంధం మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగుతుందని... వెల్లడించారు. ఇలాంటి సందర్భంలోనైనా తమ... స్నేహానికి ముప్పు ఉండదని చెప్పుకొచ్చారు. అంతేకాదు తాజాగా కల్వకుంట్ల కవితతో దిగిన ఎమోషనల్ ఫోటోను కూడా షేర్ చేశారు నందమూరి అలేఖ్య.
ఈ ఫోటో... ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజెన్స్.. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మీ ఇద్దరిదీ మంచి అనుబంధం, కలకాలం అలాగే ఉండాలని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది గులాబీ పార్టీకి ( BRS Party ) నందమూరి అలేఖ్య దగ్గరవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.






