fire acciden: నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్ ఎఫెక్ట్.. 70 చోట్ల తనిఖీలు

by Prasad Jukanti |   (  Updated:2026-02-02 12:12:51  IST  )

నాంపల్లి అగ్నిప్రమాదం నేపథ్యంలో ఫైర్ డిపార్ట్‌మెంట్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ ఆదేశాల మేరకు ఓఆర్ఆర్ పరిధిలో 70 భవనాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.

fire acciden:  నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్ ఎఫెక్ట్.. 70 చోట్ల తనిఖీలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నాంపల్లిలో ఇటీవల చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదం e Accident) నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఫైర్ డిపార్ట్‍మెంట్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ (Vikram Singh Mann) ఆదేశాల మేరకు ఓఆర్ఆర్ పరిధిలో వివిధ భవన సముదాయాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు 70 చోట్ల తనిఖీలు చేపట్టినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. భవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అందులో చిక్కుకుపోయిన వారు ప్రాణాలతో భయపడేందుకు ఉన్న అవకాశాలపై దృష్టి సారించారు. సెల్లార్లను పార్కింగ్ కోసం కాకుండా గోదాములుగా వినియోగించడం, సెల్లార్లలో వాచ్‍మన్/ సిబ్బంది కుటుంబాలను నివసింపచేయడం, మెట్లదాడురు, ర్యాంపులు అడ్డుకోవడం వంటి ఫైర్ సేప్టీ లోపాలను గుర్తిం యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. గత నెల 28న నుంచే తనిఖీలు మొదలవగా ఇవి ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

నిబంధనలు పాటిస్తున్నారా లేదా?

ఈ సందర్భంగా యజమానులు, కిరాయిదారులు, ఉద్యోగులకు అగ్ని భద్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ మరియు సివిల్ డిఫెన్స్ శాఖ డైరెక్టర్ జనరల్ అందరినీ నిబంధనలు, మార్గదర్శకాలను (Fire Safety) తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో ఆయా భవన సముదాయాల యజమానులు పాటిస్తున్న ఫైర్ సేఫ్టీ నిబంధనలపై దృష్టి పెట్టారు. ఫైర్ సేఫ్టీ కోడ్లకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారా? అగ్నిమాపక వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయా ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, స్ప్రింక్లర్ వ్యవస్థలు సక్రమంగా ఉన్నాయా? వంటి అంశాలను నిర్ధారించుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఇప్పటి వరకు చేసిన తనిఖీలు:

ఇన్‌స్టిట్యూషనల్: 03

ఆసుపత్రులు: 02

మిక్స్డ్ ఆక్యుపెన్సీ: 03

కమర్షియల్: 26

మెర్కెంటైల్: 27

అసెంబ్లీ: 03

బిజినెస్: 02

రెసిడెన్షియల్: 01

ఇండస్ట్రీ: 01

మల్టీప్లెక్స్: 01

మాల్: 01

కాగా, నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నంసంభవించిన అగ్నిప్రమాదం తీరని విషాదం నింపింది. ఈ ప్రమాదంలో భవనంలో చిక్కుకున్న ఆరుగురిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రణీత్ (8), అఖిల్ (11), బేబీ (45), ఇంతియాజ్ (28), హబీబ్ (32) మృతి చెందారు. నిర్విరామంగా 22 గంటలకు పైగా సాగించిన రెస్క్యూ ఆపరేషన్‍లో ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఉదయం ఈ ఐదుగురి మృతదేహాలను అధికారులు గుర్తించారు. ప్రమాద సమయంలో బిల్డింగ్‍లో మొత్తం ఆరుగురు ఉండగా ఐదుగురు ప్రాణాలో కోల్పోవడం విషాదం నింపింది.

Next Story