- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sridhar Babu: మంత్రి శ్రీధర్ బాబుకు ఊరట.. ఆయనపై ఉన్న కేసును కొట్టేసిన నాంపల్లి కోర్టు
ఓ కేసు విషయంలో మంత్రి శ్రీధర్ బాబుకు ఊరట లభించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ కేసు విషయంలో (Minister Sridhar Babu) మంత్రి శ్రీధర్ బాబుకు ఊరట లభించింది. (Kaleshwaram Project) కాళేశ్వరం ప్రాజెక్టు భూ సేకరణ అంశంలో మంత్రి శ్రీధర్‌బాబుపై సహా 13 మందిపై నమోదైన కేసును (Nampally court) నాంపల్లి కోర్టు కొట్టివేసింది. 2017, ఆగస్టు 23న శ్రీధర్‌బాబుతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలపై నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో శ్రీధర్ బాబుపై కేసు నమోదు అయింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో న్యాయస్థానం కేసును కొట్టివేసింది. కేసు కొట్టేసిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజా విచారణ చేస్తున్న సందర్భంగా రైతుల హక్కులను కాపాడేందుకు వినతిపత్రాన్ని ఇవ్వాలని వెళ్లామని అన్నారు. దీంతో తమపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని అన్నారు.
గత ప్రభుత్వం తమపై అక్రమంగా కేసుపెట్టిందని, ఎనిమిదేళ్లు ఈ కేసు నడిచిందన్నారు. ఈ అక్రమంగా పెట్టిన కేసును తాజాగా న్యాయస్థానం కొట్టి వేసిందన్నారు. పేద రైతు ఘోషను న్యాయస్థానం విన్నదని, ఇది ప్రజా విజయమని, రైతులు సాధించి విజయమని హర్షం వ్యక్తం చేశారు. అధికారం ఉందని గత ప్రభుత్వం కేసులు పెట్టిందని, పోలీసులను అడ్డగోలుగా వినియోగించుకున్నారని ఆరోపించారు. కానీ, నేడు ప్రజాస్వామ్యం ఉందని, చట్టాలను నమ్ముతూ తాము ముందుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. మాకు అధికారం ఉందని ఎక్కడా దుర్వినియోగం చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నిలవలేదని, దానిపైనా విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు.






