ఓటరు లిస్టులో పేర్లు మిస్సింగ్.. హైకోర్టులో సంచలన పిటిషన్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-02 08:14:43  IST  )

పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోన్న వేళ రాష్ట్రంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

ఓటరు లిస్టులో పేర్లు మిస్సింగ్.. హైకోర్టులో సంచలన పిటిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోన్న వేళ రాష్ట్రంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఓటరు లిస్టులో తమ పేర్లు రాలేదంటూ నల్గొండ జిల్లా దామరచర్ల గ్రామ పంచాయతీకి చెందిన ఓటరు బంటు రేణుక రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆమె పిటిషన్‌పై మరో రెండు రోజుల్లో విచారణ జరగనుంది. అయితే, మహబూబ్ నగర్ డీఎస్పీకి కూతురు అయిన రేణుక ఈ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకుంది. తీరా చూస్తే ఓటరు జాబితాలో తన పేరు లేకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు సూచనాప్రాయంగా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని చెప్పినట్లుగా సమాచారం.

కాగా, ఓటరు జాబితా నుంచి అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా ఓటును తొలగిస్తే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-226 కింద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అధికారం ఉంది. ముందుగా సంబంధిత ఈఆర్ఓ (Electoral Registration Officer) లేదా బీఎల్ఓ (Booth Level Officer)కు ఓటు మిస్సింగ్ ఫిర్యాదు చేయాలి. ఫారం-7పై అభ్యంతరం వచ్చిందని, అది తప్పు అని రుజువులతో సహా నిరూపించాలి. ఒకవేళ ఈఆర్ఓ సరైన నిర్ణయం తీసుకోని పక్షంలో జిల్లా ఎన్నికల అధికారి (DEO) దగ్గర అప్పీల్ వేయవచ్చు. ఇక్కడ నుంచి కూడా న్యాయం జరగకపోతే రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (Chief Electoral Officer) దగ్గర రివిజన్ పిటిషన్ వేసే అధికారం ఓటరుకు ఉంది. ఈ మూడు దశల్లోనూ న్యాయం జరగకపోతే లేదా ఎన్నికలు దగ్గరపడి సమయం లేని నేపథ్యంలో నేరుగా హైకోర్టులో ఆర్టికల్-226 కింద పిటిషన్ దాఖలు చేయవచ్చని రాజ్యాంగం చెబుతోంది.

Next Story