- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ గెలుపు కోసం పటిష్టంగా పనిచేయాలి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి
by Batti.Sumithra |
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం యువజన కాంగ్రెస్ పటిష్టంగా పనిచేయాలని నల్లగొండ ఎంపీ, హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

X
దిశ, హుజూర్ నగర్ : కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం యువజన కాంగ్రెస్ పటిష్టంగా పనిచేయాలని నల్లగొండ ఎంపీ, హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కుక్కడపు మహేష్ ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పలువురు యువజన కాంగ్రెస్ నాయకులకు నియమక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ నాయకులు గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇడుపుగంటీ సుబ్బారావు, హుజూర్ నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశముఖ్, తదితరులు పాల్గొన్నారు.
Next Story






