- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జల్సాలకు అలవాటు పడి దొంగగా మారిన యువకులు
జల్సాలకు అలవాటు పడి కోదాడ, చిలుకూరు, హుజూర్ నగర్, చౌటుప్పల్, అనంతగిరి, మునగాల, వేములపల్లి, నిడమానూరు, నేలకొండపల్లిలో తాళం వేసిన ఇళ్లను ఎంచుకుని దొంగతనాలు చేస్తున్న వ్యక్తులను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిశ, కోదాడ: జల్సాలకు అలవాటు పడి కోదాడ, చిలుకూరు, హుజూర్ నగర్, చౌటుప్పల్, అనంతగిరి, మునగాల, వేములపల్లి, నిడమానూరు, నేలకొండపల్లిలో తాళం వేసిన ఇళ్లను ఎంచుకుని దొంగతనాలు చేస్తున్న వ్యక్తులను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ నరసింహ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడలో నివసిస్తున్న ఇటికాల ఫణిచంద్, చేకూరి నాగేంద్రబాబు, ఇద్దరు మైనర్ బాలురు రాత్రివేళల్లో సంచరిస్తూ తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకునేవారు. తాళాలు పగలకొట్టి విలువైన ఆభరణాలు, నగదు అపపహరించేవారు. ఇంతేకాక ఒంటరి వృద్ధులు, ఒంటరిగా వాహనాలపై వెళుతున్న మహిళలపై దాడి చేసి ఆభరణాలు అపపహరించేవారు.
అలా అపహరించిన బంగారు, వెండి ఆభరణాలను గురువారం కోదాడలో విక్రయించేందుకు నిందితులు ఫణిచంద్, నాగేంద్రబాబు ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఏడు చోట్ల వీరు దొంగతనాలకు పాల్పడ్డారని, వారి నుంచి రూ.11 లక్షల విలువైన 8 తులాల బంగారం, వెండి, బైక్, రూ.60 వేల విలువైన 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరు గతంలో కూడా పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించారని, మైనర్లను జువైనల్ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.
అనుమానితులు ఎదురైతే వెంటనే 100 నంబర్ కు డయల్ చేయాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. కేసులను ఛేదించడంలో చాకచక్యం ప్రదర్శించిన కోదాడ డీఎస్సీ శ్రీధర్ రెడ్డి, టౌన్ సీఐ కే. శివశంకర్, ఎస్సై బీ. సుధీర్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సై బీ హనుమ నాయక్, హెచ్ సీలు బీ శ్రీనివాస్, కరుణాకర్, కృష్ణ, పీసీలు ఎల్లారెడ్డి, కొండలు, సతీష్ నాయుడు ను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.






