ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి యువకుడు మృతి

by Bhanu |

ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి ఈతరాక యువకుడు మృతి చెందిన సంఘటన జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెంలో జరిగింది.

ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి యువకుడు మృతి
X

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి ఈతరాక యువకుడు మృతి చెందిన సంఘటన జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెంలో జరిగింది. అర్వపల్లి ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నగూడెం గ్రామానికి చెందిన జూలూరు మహేష్ మంగళవారం గేదెలను మేతకు తోలుకపోయి, రేగులకుంటలోకి నీళ్లు తాపడానికి కొట్టుకపోయాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోలీసుల సాయంతో మృతదేహాన్ని బుధవారం చెరువు నుంచి తీసి పోస్ట్ మార్టంకు తరలించినట్లు ఆయన చెప్పారు. శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేసినట్లు తెలిపారు.



Next Story