- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాదగిరిగుట్టలో బాలిక మృతదేహం కలకలం
by Bhanu |
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు కళ్యాణకట్ట దగ్గర ఉన్న డార్మెంటరీ హాల్ లో బాలిక మృతదేహం లభ్యమైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.

X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి :యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు కళ్యాణకట్ట దగ్గర ఉన్న డార్మెంటరీ హాల్ లో బాలిక మృతదేహం లభ్యమైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.యాదగిరిగుట్ట ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం కళ్యాణ కట్ట దగ్గర ఉన్న డార్మెంటరీ హాల్లో ఒక బాలిక శవం పడి ఉండడాన్ని భక్తులు, దేవస్థానం సిబ్బంది గమనించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. మృతి చెందిన బాలికకు 10 నుంచి 12 సంవత్సరాలు ఉండవచ్చునని భావించారు. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. బాలిక మృతిపై విచారణ చేపడుతున్నట్లు ఎస్సై ఉదయ్ కిరణ్ వెల్లడించారు.
Next Story






