- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాచరాజుపల్లి గ్రామాభివృద్ధికి కృషి : సర్పంచ్ బాబు రామ్ నాయక్
మండల పరిధిలోని కాచరాజుపల్లి గ్రామాభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తానని సర్పంచ్ బాబు రామ్ నాయక్ తెలిపారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇవాళ సర్పంచ్ ఆధ్వర్యంలో పనులు ప్రారంభం చేశారు.

దిశ, నేరేడుగొమ్ము : మండల పరిధిలోని కాచరాజుపల్లి గ్రామాభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తానని సర్పంచ్ బాబు రామ్ నాయక్ తెలిపారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇవాళ సర్పంచ్ ఆధ్వర్యంలో పనులు ప్రారంభం చేశారు. గ్రామంలో పేరుకుపోయిన చెత్త, చెదారాన్ని తొలగించారు. అక్కడక్కడ ఉన్న ముళ్ల కంప చెట్లను జేసీబీ సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బాబు రామ్ మాట్లాడుతూ గ్రామంలో పరిశుభ్రత పాటిస్తే.. ఎలాంటి వ్యాధులనైనా అరికట్టవచ్చని తెలిపారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ సహాకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని తెలిపారు. గ్రామంలో మౌలిక వసతులు, రహదారులు, పారిశుధ్య పనులు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నేతళ్ల హన్మంత్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.






