- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భద్రత వైఫల్యంతో టీమేజ్ కంపెనీలో కార్మికుడు మృతి
భద్రత ప్రమాణాలు పాటించకపోవడం, యాజమైన నిర్లక్ష్యం కారణంగా కార్మికుడు మృతి చెందిన సంఘటన మండలంలోని పామనగుండ్ల శివారులోని టీమేజ్ కంపెనీలో శుక్రవారం జరిగింది.

దిశ, నకిరేకల్ టౌన్ (కట్టంగూర్) : భద్రత ప్రమాణాలు పాటించకపోవడం, యాజమైన నిర్లక్ష్యం కారణంగా కార్మికుడు మృతి చెందిన సంఘటన మండలంలోని పామనగుండ్ల శివారులోని టీమేజ్ కంపెనీలో శుక్రవారం జరిగింది. సంఘటనకు సంబంధించి మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట మండలం ఉత్తటూరు గ్రామానికి చెందిన మేడి రఘువరన్ (27) గత కొన్నేళ్లుగా టీమేజ్ కంపెనీలో ఆపరేటర్ గా పని చేస్తున్నాడు.రోజువారీగా శుక్రవారం ఉదయం డ్యూటీ లో చేరాడు.
కంపెనీలోని షెడ్డులో వెంటిలేషన్ కొరకు ఏర్పాటు చేసిన రేకులను శుభ్రం చేయాలని మేనేజర్ సూచించడంతో సుమారు 50 అడుగుల ఎత్తు ఉన్న రేకుల షెడ్ పైకి ఎక్కాడు.వెంటిలేషన్ కోసం ఏర్పాటుచేసిన ప్లాస్టిక్ రేకులు దీర్ఘకాలమవడంతో నాణ్యత లోపించి పలిగిపోయాయి. దీంతో శుభ్రం చేస్తున్న రఘువరన్ ప్రమాదవశాత్తు 50 అడుగుల ఎత్తు నుండి నేలపై పడడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో చికిత్స నిమిత్తం రఘువరన్ సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు మృతుడికి తల్లి, భార్య ఉన్నారు
నష్టపరిహారం చెల్లించాలని కంపెనీ ముందు బంధువుల ధర్నా
యాజమాన్యం వైఫల్యం కారణంగా మృతి చెందిన రఘువరన్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని కోరుతూ మృతుడి బంధువులు శనివారం కంపెనీ ముందు ధర్నా నిర్వహించారు. నష్టపరిహారం చెల్లించేంతవరకు అక్కడనుండి కదిలేది లేదని తేల్చి చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన వారిని వారించడంతో పోలీసులకు మృతుడి బంధువులకు వాగ్వాదం అయింది దీంతో మృతుడి బంధువులు జాతీయ రహదారిపై సుమారు అరగంట సేపు ధర్నా నిర్వహించడంతో జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి విషయం తెలుసుకున్న నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి సిఐలు కొండల్ రెడ్డి నాగరాజులు, స్థానిక ఎస్సై రవీందర్ లు కంపెనీ వద్దకు చేరుకొని మృతుడి బంధువులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్ది,ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించారు
భద్రత వైఫల్యం వల్లే మృతి
టీనేజ్ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం, భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతోనే రఘువరన్ మృతి చెందాడని తోటి కార్మికులు,బంధువులు ఆరోపించారు. సుమారు 50 అడుగుల ఎత్తు ఉన్న షెడ్డు ఎక్కినప్పుడు సేఫ్టీ బెల్టు,రోడ్, హెల్మెట్ ఏర్పాటు చేయలేదని, కాలం చెల్లిన రేకులను శుభ్రపరచడం కోసం అనుభవం లేని రఘువరన్ ను పనికి పురమాయించడం యాజమాన్యం వైఫల్యమే కారణమన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించి ఉంటే కొద్దిపాటి గాయాలతో రఘువరన్ బయటపడేవాడని అంటూ తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.






