సాధారణ ప్రసవాలు పెరిగేలా పని చేయాలి : కలెక్టర్ వి. హనుమంతరావు

by Nallavelli.Anjaneyulu |

ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలని.. డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు పని చేయాలని యాదాద్రి భువనగిరి కలెక్టర్ వి. హనుమంతరావు సూచించారు.

సాధారణ ప్రసవాలు పెరిగేలా పని చేయాలి : కలెక్టర్ వి. హనుమంతరావు
X

దిశ, సంస్థాన్ నారాయణపురం : ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలని.. డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు పని చేయాలని యాదాద్రి భువనగిరి కలెక్టర్ వి. హనుమంతరావు సూచించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి మొత్తం తిరిగి చూస్తూ గదిలో చెత్త ఉండడానికి గమనించి పరిశుభ్రత పాటించాలని సూచించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఓ వ్యక్తిని అందుతున్న వైద్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంగళవారం ఆశా డే కావటంతో అప్పటికే ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ నెలలో మండలంలో ఎన్ని డెలివరీలు జరిగాయని కలెక్టర్ అడగగా 35 డెలివరీలు జరిగాయని అందులో 9 ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగాయని సమాధానం ఇచ్చారు. 100% ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీలు జరిగేలా సిబ్బంది పనిచేయాలని.. ఆ వైపుగా గ్రామంలో ప్రజలను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా డెలివరీలు జరిగేలా పని చేయాలని స్థానిక మెడికల్ ఆఫీసర్లకు సూచించారు. ఇద్దరూ మహిళ డాక్టర్లు ఉండటం శుభ పరిణామం అని, ప్రసవాలు పెరిగేలా పని చేయాలని వారిని ఆదేశించారు. ఆయన వెంట చౌటుప్పల్ ఆర్డిఓ వి.శేఖర్ రెడ్డి, త‌హ‌శీల్దార్ పీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో కే ప్రమోద్ కుమార్, ఎస్సై జగన్,మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ రవీనా, జ్యోత్స్న, ఉన్నారు.

Next Story