- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా సాధికారత అవసరం
by Naveena |
సమాజంలోని మహిళలకు సాధికారత అవసరమని మండల విద్యాశాఖాధికారి ఎం.గురవయ్య అన్నారు.

X
దిశ, చిలుకూరు: సమాజంలోని మహిళలకు సాధికారత అవసరమని మండల విద్యాశాఖాధికారి ఎం.గురవయ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. శుక్రవారం బేతవోలు జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయినులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధికారత ద్వారా వారు తమ లక్ష్యాలను సాధించడంతో పాటు ఇతరులకూ సాయం చేయగల స్థాయికి చేరుకుంటారని ఆయన అన్నారు. ఆ దిశగా అందరూ ఆలోచించి మహిళాభ్యుదయానికి కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. సన్మానం పొందిన వారిలో ఉపాధ్యాయినులు కల్పన, సీఆర్పీ నిర్మల, ఓఎస్ రాజ్యం ఉన్నారు. వారిని పూలమాలలు, జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి ప్రధానోపాధ్యాయుడు చందా శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, సిబ్బంది కోటేశ్వరరావు, వీరబాబు, శౌరి, వెంకన్న, శ్రీరామ్, కృష్ణ, ప్రకాశ్, వెంకటేశ్వర్లు, లాల్, శ్రీధర్ పాల్గొన్నారు.
Next Story






