- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిడుగు పడి మహిళా రైతు మృతి
by Bhanu |
పిడుగు పడి మహిళా రైతు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కురంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

X
దిశ, కనగల్లు : పిడుగు పడి మహిళా రైతు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కురంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కనగల్లు ఎస్సై పి.విష్ణు తెలిపిన వివరాల ప్రకారం కురంపల్లి గ్రామానికి చెందిన కావలి సత్తమ్మ (45) గ్రామ శివారులోని ఆదివారం ఎస్ఎల్బిసి కాలువ సమీపంలో గేదెలను మేపుతుండగా మధ్యాహ్నం రెండున్నర నుంచి మూడు గంటల మధ్యలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో గేదెలను తోలుకుంటూ ఇంటి వైపు వస్తుండగా చెరువు వద్ద సుమారు 30 మీటర్ల దూరంలో పిడుగు పడడంతో సత్తమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.మృతురాలికి కుడి భుజం నుండి చాతి వరకు కాలిన గాయాలు ఉన్నాయి. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు కావలి సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






