- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి
రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కనగల్లు ఎస్సై పి.విష్ణు తెలిపిన వివరాల ప్రకారం..

దిశ, కనగల్లు : రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కనగల్లు ఎస్సై పి.విష్ణు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 9.30 గంటల సమయంలో కనగల్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బొల్లెపల్లి సైదులు(47)విధి నిర్వహణలో భాగంగా జి.చెన్నారం గ్రామంలో పిటిషన్ ఎంక్వయిరీ పూర్తిచేసి తిరిగి స్టేషన్‌కు మోటార్ సైకిల్‌పై వెళ్తున్నాడు. అయితే.. మార్గమధ్యలో ధర్వేశిపురం గ్రామ శివారులోని జి.ఎల్.గార్డెన్ సమీపంలో సైదులు నడుపుతున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు.
ఈ ప్రమాదంలో ఆయనకు ఎడమవైపు ఛాతీ, పొట్ట భాగం, ఎడమ చేతి భాగం, కంటి కింది భాగంలో తీవ్రమైన గాయాలు తగిలినట్లు నిర్ధారణ అయింది. సంఘటనను గమనించిన కనగల్ పోలీస్ స్టేషన్ లోని కానిస్టేబుల్ ఎం. రవీందర్ రెడ్డి అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించగా వెంటనే 108 అంబులెన్స్ ద్వారా గాయపడిన సైదులును నల్లగొండ పట్టణంలోని ఐకాన్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం సుమారు 1 గంటల సమయంలో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈసంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు, ఉన్నారు. పోలీసు శాఖ ఈ విషాద సమయంలో సైదులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తోంది. విధి నిర్వహణలో భాగంగా జరిగిన ఈ ఘటన మరణం పోలీసు శాఖకు తీరని లోటు అని ఎస్ఐ అన్నారు.






