- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చికిత్స పొందుతూ మహిళ మృతి.. హాస్పిటల్ ముందు బంధువుల ఆందోళన
వైద్యం కోసం హాస్పిటల్ కి వచ్చిన మహిళ డాక్టర్ల నిర్లక్ష్య కారణంగా మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని జ్యోతి హాస్పిటల్ లో గురువారం చోటు చేసుకుంది.

దిశ, మిర్యాలగూడ : వైద్యం కోసం హాస్పిటల్ కి వచ్చిన మహిళ డాక్టర్ల నిర్లక్ష్య కారణంగా మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని జ్యోతి హాస్పిటల్ లో గురువారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన చెవులపాటి జానకమ్మ (65) అనే మహిళ గత మూడు రోజుల క్రితం గుండెనొప్పితో జ్యోతి హాస్పిటల్ లో వైద్యం కోసం చేరారు.
చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందారు. అయితే జానకమ్మ మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఆమె కుటుంబసభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. గంట ముందు వరకు ఆరోగ్యంగా ఉన్న తమ తల్లిని వైద్యం కోసం ల్యాబ్ లోకి తమకు చెప్పకుండానే తీసుకువెళ్లి నిర్లక్ష్యంతో వ్యవహరించి సరైన వైద్యం చేయకుండా తమ తల్లి మృతికి డాక్టర్లు కారణమయ్యారని మృతురాలి కుమారుడు రమేష్ ఆరోపించారు.
దీంతో పాటు అంతేగాక తమ తల్లి జానకమ్మ చనిపోయినప్పటికీ నిర్ధారించకుండా డాక్టర్లు జాప్యం చేశారని పేర్కొన్నారు. దీంతోపాటు ఆరోగ్యశ్రీ వర్తిస్తున్నప్పటికీ అదనంగా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు బంధువులు ఆరోపించారు. దీంతో హాస్పిటల్ వద్ద ఉదృతత వాతావరణం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ విషయంపై జ్యోతి హాస్పిటల్ ఎండీ డాక్టర్ మువ్వా రామారావు వివరణ కోరగా జానకమ్మ మృతిలో డాక్టర్ల నిర్లక్ష్యం లేదన్నారు. ఆమెకు ఎంజోగ్రామ్ చేసి స్టెంట్లు వేసేందుకు ల్యాబ్ లోకి తీసుక వెళ్తుండగా రెండోసారి ఆకస్మికంగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు తెలిపారు.






