గ‌వ‌ర్న‌ర్ ప్రోగ్రామ్ కి ఎన్నిక‌ల కోడ్ అడ్డు వ‌స్తుందా..?

by Nallavelli.Anjaneyulu |

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ జిష్ణు దేవ్ వ‌ర్మ సూర్య‌పేట ప‌ర్య‌ట‌న‌కు ఎన్నిక‌ల కోడ్ అడ్డు వ‌స్తుందా..? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్ ప‌ర్య‌ట‌న రెండు సార్లు వాయిదా ప‌డింది.

గ‌వ‌ర్న‌ర్ ప్రోగ్రామ్ కి ఎన్నిక‌ల కోడ్ అడ్డు వ‌స్తుందా..?
X

దిశ, హుజూర్ నగర్ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణంలోని కేఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో నవోదయ స్కూల్ నిర్మాణ పనులకు శంకుస్థాపనతో పాటు హుజూర్ నగర్ పట్టణంలోని మగ్ధమ్ నగర్ లోని 100 ఎకరాలో 126 కోట్లతో నిర్మాణం చేపట్టబోతున్న అగ్రికల్చర్ కాలేజీ శంకుస్థాపన చేయనున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గాలలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన మఠంపల్లి మండలంలోని మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం సందర్శించి దర్శించుకోనున్నారు. అధికారులు ఇప్పటికే పనులలో నిమగ్నమై ఉన్నారు.

ఇప్పటికే రెండుసార్లు వాయిదా..?

కోదాడలోని నవోదయ స్కూల్ నూతన భవనం పనుల ప్రారంభంతో పాటు హుజూర్ నగర్ పట్టణంలోని మగ్ధమ్ నగర్ లోఅగ్రికల్చర్ కాలేజీ నిర్మాణ పనుల ప్రారంభానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మొదట ఈనెల 17న వస్తున్నారంటూ ఆ తరువాత 20 వస్తున్నారంటూ.. ప్రస్తుతం ఈనెల 23న వస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. కానీ ఆయన పర్యటనపై అయితే ‌ అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడ లేదు.

ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం..

ప్రస్తుతం కోదాడ హుజూర్ నగర్ మున్సిపాలిటీ కావడంతో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ వార్డులకు చైర్మన్ రిజర్వేషన్లు ప్రకటించింది. దీంతో ఈనెల 20, 21న ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ వస్తే.. అభివృద్ధి పనులకు సంబంధించి ఎటువంటి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయకూడదు. ఎన్నికల కోడ్ వస్తే గవర్నర్ పర్యటన క్యాన్సిల్ అవుతుందని 23 వరకు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకుంటే ఈనెల 23న గవర్నర్ పర్యటన ఉంటున్నట్టు తెలుస్తుంది.

Next Story