- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
మా పేర్లు ఎందుకు లేవు...?

దిశ,వలిగొండ: మండలంలోని అరూర్ వేములకొండ,వెల్వర్తి,పహిల్వాన్పూర్, జాలుకాల్వ,నెమిలకాల్వ, ప్రొద్దటూర్ గ్రామాల్లో నాలువ రోజు గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా అరూర్, వెల్వర్తి, పహిల్వాన్పూర్, వేములకొండ గ్రామాల్లో పోలీస్ బందోబస్త్ నడమ నిర్వహించిన గ్రామసభల్లో గందరగోళం చోటు చేసుకుంది. లబ్ధిదారుల జాబితాల్లో పేర్లు లేని వారు అధికారులను నిలదీశారు.అదేవిధంగా జాబితాను ఎవరు తయారు చేశారో అధికారులు చెప్పాలని ఆయా గ్రామస్తులు డిమాండ్ చేశారు.అధికారులు ప్రజలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. పోలీసులు సిబ్బంది శాంతి భద్రతలకు భగం కాకుండా చర్యలు తీసుకున్నారు. మండలంలోని జాలుకాల్వ, నెమిలకాల్వ, ప్రొద్దటూర్ గ్రామల్లో నిర్వహించిన..గ్రామ సభల్లో పేర్లు లేనివారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి జగన్నాధ రావు, తహసీల్దార్ పి. శ్రీనివాస్ రెడ్డి,ఎంపీడీవో జితేందర్రెడ్డి, వెటర్నరీ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి,మండల వ్యవసాయ అధికారి అంజనీదేవి,ఎంపీవో కేదారేశ్వర్,ఆరైలు మనోహర్, కరుణాకర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.