పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం : మంత్రి

by Naveena |

రాష్ట్రంలో ప్రతి రైతు పండించిన గింజను కొనుగోలు చేస్తామని, రైతులు ఎవరు అధైర్య పడవద్దని సన్న ధాన్యానికి మద్దతు ధరతోపాటు బోనస్ కూడా ఇస్తున్నామని మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం : మంత్రి
X

దిశ, హుజూర్ నగర్ : రాష్ట్రంలో ప్రతి రైతు పండించిన గింజను కొనుగోలు చేస్తామని, రైతులు ఎవరు అధైర్య పడవద్దని సన్న ధాన్యానికి మద్దతు ధరతోపాటు బోనస్ కూడా ఇస్తున్నామని మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హుజూర్ నగర్ లో ఈ నెల 30న ఉగాది రోజున రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నందున బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి పరిశీలించారు . అనంతరం కౌండిన్య ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతులందరికీ మేలు జరుగుతుందని అన్నారు.

గతంలో ఉన్న ప్రభుత్వాలు రైతులను ఆదుకోలేదని విమర్శించారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఉగాది రోజున మన హుజూర్ నగర్ నుండే ప్రారంభిస్తున్నామని తెలిపారు. సభ ప్రాంగణానికి రాజీవ్ ప్రాంగణంగా నామకరణం చేశామన్నారు. 40 వేల మందితో సభ నిర్వహించబోతున్నామని ప్రకటించారు. రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన రెండు వేల సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారని పేర్కొన్నారు. సీఎం 5 గంటలకు సభా వేదిక వద్దకు వస్తారని సభ గంట పాటు ఉంటుందని తెలిపారు. ఈ సభకు హుజూర్ నగర్ కోదాడ ప్రాంతాలకు చెందిన ప్రతి కార్యకర్త కుటుంబ సమేతంగా రావాలని కోరారు. ఇది రాష్ట్రంలోనే జరుగుతున్న పెద్ద పండగ అని వ్యాఖ్యానించారు. హుజూర్ నగర్ ప్రాంతంలోని ప్రతి ఎకరానికి నీరు అందే విధంగా లిఫ్టులను ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు. రోడ్లు,త్రాగు,సాగు నీరు,వైద్యం,విద్య తో పాటు అన్ని వసతులు ఈ రెండు నియోజకవర్గాల్లో కల్పిస్తామన్నారు. హుజూర్ నగర్ కు హైదారాబాద్ తరహాలో రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నామని ,అర్హులైన అందరికీ రేషన్ కార్డు లు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. రెండు నియోజకవర్గాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త బిల్డింగ్ లు కట్టిస్తున్నామన్నారు. ఆహార భద్రత లో గొప్ప మార్పు తీసుకు వస్తూ.. రాష్ట్ర జనాభాలో 80శాతం మందికి సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంలో కీలక పాత్ర నేనే వహించానని పేర్కొన్నారు.

Next Story