పంచాయతీ ఎన్నికల్లో 75 శాతం ఫలితాలు సాధించాం : జైవీర్ రెడ్డి

by Ratna Kumari |

పంచాయతీ ఎన్నికల్లో 75 శాతం ఫలితాలు సాధించాం : జైవీర్ రెడ్డి
X

దిశ, హాలియా : గడిచిన పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 75శాతం విజయం సాధించినట్లు ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి శనివారం సాయంత్రం అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని పేర్కొన్నారు. గత 2004-2014 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అప్పటి రాష్ట్ర మంత్రి కుందూరు జానారెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 36వేల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టినట్లు వివరించారు. గత 2014-24 కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని ఆరోపించారు. తమ నియోజకవర్గంలో గిరిజనులు అత్యధికంగా ఉన్నారని ప్రభుత్వం తమకు అదనంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అంతేకాకుండా పెండింగ్ లో రూ.1.35 కోట్ల రూపాయల ఇందిరమ్మ ఇండ్ల బిల్లులను సంబంధిత మంత్రి వెంటనే విడుదల చేయాలని కోరారు. నిరుపేదల అభివృద్దే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని గుర్తు చేశారు.

Next Story