- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయకట్టులో వరి గోస.. నీరు లేక నెర్రబారిన పొలాలు
ఆరుగాలం కష్టించి పండించిన పంట తీరా నోటి కాడికి వచ్చిన సమయంలో దెబ్బతినే ప్రమాదం ఉండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి పండించిన పంట పక్షం రోజుల్లో కోతకు వచ్చే సమయానికి నీళ్లు లేక ఎండిపోవుతుండడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు.

దిశ, హాలియా: ఆరుగాలం కష్టించి పండించిన పంట తీరా నోటి కాడికి వచ్చిన సమయంలో దెబ్బతినే ప్రమాదం ఉండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి పండించిన పంట పక్షం రోజుల్లో కోతకు వచ్చే సమయానికి నీళ్లు లేక ఎండిపోవుతుండడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. ఓవైపు భారీ వర్షాలతో గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతాంగం నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతంలో 15 రోజులు గడిస్తే పంట చేతికి వచ్చే సమయంలో నీరు లేక నెర్రబారుతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఓవైపు వర్షాలతో తట్టుకొని పంటను కాపాడుకున్న రైతులకు గత పది రోజులుగా ప్రధాన ఎడమ కాలువకు నీరు విడుదల చేయకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లక్షలాది ఎకరాల్లో ఎండుతున్న పొలాలు...
దిశ, హాలియా: నాగార్జునసాగర్ ప్రధాన ఎడమకాలువ కింద ప్రస్తుత వానకాలం సీజన్లో సుమారు 11 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేశారు. కాగా ఇప్పటికే 60 శాతం మేర వరి కోతకు రాగా మరో 40% మేర పంట పొలాలు పొట్ట దశ లో ఉన్నాయి. గత 15 రోజులుగా అడపాదడపా వర్షాలు వస్తుండడంతో ఇప్పటికే పలుచోట్ల చిరు పొట్ట దెబ్బతిన్న పొలాలు ఎంతో కొంత దక్కినప్పటికీ గత పది రోజులుగా ప్రధాన ఎడమ కాలువ ముది మాణిక్యం మేజర్ షటర్ మరమ్మతుల పనులు చేయడం కారణంగా పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు పేర్కొంటున్నారు. కాగా మరమ్మతుల పనులతో ఎన్ఎస్పీ అధికారులు ప్రధాన ఎడమ కాలువకు నీటిని నిలుపుదల చేశారు. వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుండడంతో ఓవైపు తుఫాన్ ప్రభావంతో చిరుజల్లులు పడుతున్నప్పటికీ ఎండలు దంచి కొడుతున్నాయి. వరి పంట పొట్ట దశలో ఉండడంతో వరిపంట అధిక నీటిని తీసుకుంటుంది. దీంతో ఆయకట్టు ప్రాంతంలో ఉన్న పొలాలు ఎండు దశకు చేరుకుంటున్నాయని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
తక్షణమే నీటిని విడుదల చేయాలి..
నాగార్జునసాగర్ ప్రధాన ఎడమ కాలువకు తక్షణమే నీటిని విడుదల చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయకట్టులో సుమారు 40 శాతం మేర పంట పొలాలు పొట్ట దశలో ఉండగా నీరు లేక ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు లేకపోవడంతో గింజలు పాలు పోసుకోలేక తాలుగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రధాన ఆయకట్టులోని రాజవరం, సూరేపల్లి, పేరూరు, బంకాపురం మేజర్ల కింద పొలాలకు వెంటనే నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరో 15 రోజులపాటు నీటిని విడుదల చేసినట్లయితే తమ పంటలు చేతికి వస్తాయని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరమ్మత్తులు పూర్తయిన వెంటనే నీటిని విడుదల చేస్తాం... గోపీనాథ్ ఈఈ ఎన్ఎస్పి
నాగార్జునసాగర్ ప్రధాన ఎడమ కాలువ పై ఉన్న ముది మాణిక్యం మేజర్ షట్టర్ మరమ్మతులకు గురైంది. గత వారం రోజులుగా ఇట్టి మరమ్మతుల పనులు చేయడం జరిగింది. 24 గంటల్లో ప్రధాన ఎడమకాలువకు సాగునీటిని విడుదల చేస్తాం. రైతులు ఆందోళన చెందవద్దు.






