- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెల్లిబండ తండాలో వాటర్ ప్లాంట్ అస్తవ్యస్తం
దిశ, తిరుమలగిరి: 2014లో గిరిజన తండాలకు రక్షిత మంచినీటి సరఫరా అందించేందుకు జాతీయ సమగ్ర వాటర్‌షెడ్ పథకంతో నెల్లిబండ తండాలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ప్రస్తుతం పూర్తిగా

దిశ, తిరుమలగిరి: 2014లో గిరిజన తండాలకు రక్షిత మంచినీటి సరఫరా అందించేందుకు జాతీయ సమగ్ర వాటర్‌షెడ్ పథకంతో నెల్లిబండ తండాలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ప్రస్తుతం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. గత రెండేళ్లుగా ప్లాంట్ నిర్వహణ ఇష్టారాజ్యంగా మారి, ఒక్క నీటి క్యాన్‌కు రూ.10 వసూలు చేస్తూ నాణ్యతలేని నీటిని అందిస్తున్నారని తండావాసులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. గతంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఉన్న ఈ ప్లాంట్‌ను ఇప్పుడు ఎవరు నిర్వహిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీ సిబ్బంది పేరుతో కొందరు కాసులకు కక్కుర్తి పడి, అధికార దుర్వినియోగంతో ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని తండా గ్రామస్థులు వాపోతున్నారు. ప్రభుత్వం విద్యుత్, నీటి సరఫరాను ఉచితంగా అందిస్తున్నప్పటికీ, ప్రైవేటు సంస్థల మాదిరిగా వసూళ్లు చేయడం ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది. నాణ్యత లేని నీటిని తాగడంతో తరచూ అనారోగ్యం రావడం, దవాఖానలను ఆశ్రయించడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు రూపాయలకు ఇవ్వాల్సిన క్యాన్‌ను రూ.10కి పెంచడం ఏ న్యాయమని ప్రశ్నిస్తున్నారు.“ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆపాలి..వెంటనే చర్యలు తీసుకోవాలి” అని తండా ప్రజలు మున్సిపాలిటీ అధికారులను కోరుతున్నారు.






