- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు రద్దు చేయాలి
by Naveena |
ముస్లిం మైనారిటీలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కోదాడ మండల ముస్లిం మైనారిటీ సెల్ ఆరోపించింది.

X
దిశ, కోదాడ: ముస్లిం మైనారిటీలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కోదాడ మండల ముస్లిం మైనారిటీ సెల్ ఆరోపించింది. వక్ఫ్ సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా.. ఆ విభాగం బుధవారం కోదాడలో విలేకరుల సమావేశం నిర్వహించింది. నాయకులు మాట్లాడుతూ.. తమ ధన, మాన, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింలు ఏ విధంగా పాల్గొన్నారో అదే విధంగా ఈ సవరణ బిల్లు రద్దయేంత వరకూ అందరి సహకారంతో పోరాటం చేస్తామని అన్నారు. ఇది కేవలం వక్ఫ్ సవరణ బిల్లు రద్దు పోరాటమే కాదని రాజ్యాంగ పరిరక్షణ యుద్ధమని అన్నారు. ఈ సమావేశంలో మైనారిటీ నాయకులు షేక్ బాజన్, ఖలీల్ మౌలానా, డాక్టర్ జబ్బార్, షేక్ అలీ, షేక్ నజీర్, షేక్ హమీద్, జానీ బాబా, డాక్టర్ గౌస్ అహ్మద్, మహమ్మద్ ముస్తఫా, సజావుద్దీన్, రఫీ ,సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






