- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమతి కొంత తవ్వేది అంతా.. మట్టి తరలింపులో నిబంధనలకు పాతర
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారం రామసముద్రం చెరువులో మట్టి తవ్వకాలకు అనుమతి కొంత ఉంటే.. చెర్వునంతా తవ్వి రవాణా చేస్తున్నారు. నిబంధనలలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నీటిపారుదల శాఖ అధికారుల పర్యవేక్షణలో మాత్రమే మట్టిని తరలించాలి.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారం రామసముద్రం చెరువులో మట్టి తవ్వకాలకు అనుమతి కొంత ఉంటే.. చెర్వునంతా తవ్వి రవాణా చేస్తున్నారు. నిబంధనలలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నీటిపారుదల శాఖ అధికారుల పర్యవేక్షణలో మాత్రమే మట్టిని తరలించాలి. అయితే అవన్నీ తమకేమీ పట్టనట్లు మట్టి మాఫియా తమ ఇష్టారీతిన రెచ్చిపోతుంది. రాత్రి పగలు తేడా లేకుండా తెల్లవార్లు మట్టి తరలింపు తో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడున్నారు. మట్టి తరలింపుపై స్థానికులు ఎవరైనా నిలదీస్తే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. వరుస వివాదాలు నిబంధన ఉల్లంఘన జరిగిన అధికారులు చర్యలు తీసుకోకపోవడంలో అధికార రాజకీయ ఒత్తిళ్లు ప్రధాన కారణమని తెలుస్తుంది. నిబంధనలకు నిలువునా పాతర వేసి మట్టి రవాణా జరుపుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదంటే ఏ స్థాయిలో మట్టి మాఫియా కు అధికార అండదండలు ఉన్నాయో ఇట్టే అర్థమవుతుంది.
= దిశ,నల్లగొండ బ్యూరో
దిశ,నల్లగొండ బ్యూరో : మట్టి తరలింపు అనుమతి పత్రాలలో జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘిస్తున్న అధికారులు చర్యలు తీసుకోవడంలో ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. అధికార బలం ఉండడంతో తమను ఏమీ చేయలేరని మట్టిమాఫియా రెచ్చిపోతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వరుస వివాదాలు నిబంధన ఉల్లంఘన జరిగిన అధికారులు చర్యలు తీసుకోకపోవడంలో అధికార రాజకీయ ఒత్తిళ్లు ప్రధాన కారణమని తెలుస్తుంది. ఈ అక్రమ మట్టి దందాకు అధికార రాజకీయ నాయకుల సహకారం ఉందనే ఆరోపణలపై ఎందుకు మౌనం వహిస్తున్నారనేది అర్థం కావడం లేదు.నిబంధనలకు నిలువునా పాతర వేసి మట్టి రవాణా జరుపుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదంటే ఏ స్థాయిలో మట్టి మాఫియా కు అధికార అండదండలు ఉన్నాయో ఇట్టే అర్థమవుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారం రామసముద్రం చెరువులో మొదటి దశ అనుమతులు జారీ చేసినప్పుడు స్థానికులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా మరో 13 రోజులు 3,000 మెట్రిక్ టన్నుల మట్టిని తరలించకపోయేందుకు అనుమతులు పొడిగించడం పట్ల అధికారుల వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
రాత్రి పగలు తేడా లేకుండా.
గోకారం రామసముద్రం చెరువు నుంచి మట్టి తరలింపునకు జారీ చేసిన అనుమతుల నిబంధనలలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నీటిపారుదల శాఖ అధికారుల పర్యవేక్షణలో మాత్రమే మట్టిని తరలించాలని సూచించారు. అయితే అవన్నీ తమకేమీ పట్టనట్లు మట్టి మాఫియా తమ ఇష్టారీతిన రెచ్చిపోతుంది. రాత్రి పగలు తేడా లేకుండా తెల్లవారులు మట్టి తరలింపు తో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. అయితే ఈ మట్టి తరలింపుపై స్థానికులు ఎవరైనా నిలదీస్తే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు జారీ చేసిన నిబంధన ప్రకారం నడుచుకోవాల్సిన మట్టి మాఫియా ఎందుకు వాటిని ఉల్లంఘించి రాత్రి సమయాల్లో నల్లమట్టి రవాణా చేస్తుంది అనేది అర్థం కావడం లేదు. కేవలం 3000 మెట్రిక్ టన్నుల మట్టి రవాణా సరఫరాకు 13 రోజుల సమయం ఇవ్వగా రాత్రి పగలు తేడా లేకుండా ఈ మట్టిని రవాణా చేస్తుంటే ఏ స్థాయిలో మట్టి దోపిడీ జరుగుతుందో ఇట్లే అర్థం చేసుకోవచ్చు.
11 వాహనాలకే అనుమతి...
మట్టిని తరలించేందుకు నీటిపారుదల శాఖ 11 వాహనాలకు అనుమతులు మంజూరు చేసింది. కానీ మట్టి వ్యాపారులు అనుమతులు లేని వాహనాలలో కూడా మట్టి రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మొదటి దశలో ఇచ్చిన అనుమతుల్లోని వాహనాల నెంబర్లతోనే తిరిగి అనుమతులను పొడగించారు. మొదటి దశలో అనుమతి లేని వాహనాలలో కూడా మట్టిని తరలించడంతో పోలీసులు వాటిని వివిధ ప్రాంతాలలో పట్టుకొని కేసులు నమోదు చేసినట్లు కూడా సమాచారం.ప్రస్తుతం అనుమతి ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లు 1) TS 08 UK5752 2)TS08UK5826
3) TG08U2618 4)TG08UM0765 5)TG13T9456 6)TS07UL4433 7)TS30T2772 8)TS30T0027 9)TS30T3178 10)TS03UB0280 11)TS03UB02777 గా ఉన్నాయి. కేవలం ఈ వాహనాలలో మాత్రమే మట్టిని రవాణా చేసేందుకు నీటిపారుదల శాఖ అనుమతులు మంజూరు చేసింది.
అధికార పార్టీపై ఆరోపణలు!
గోకారం రామసముద్రం చెరువు నుండి మట్టి తరలింపు పై అధికార పార్టీ నాయకుల హస్తం ఉందని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి నల్ల మట్టిని తరలిస్తుంటే అధికార పార్టీ నాయకులు వారికి ఎందుకు సహకరిస్తున్నారనే ప్రశ్న ఇప్పుడు మండల వ్యాప్తంగా జోరుగా చర్చించుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దీనిపై ఇకనైనా ప్రత్యేక దృష్టి సారించి నల్లమట్టి తరలింపులో నిబంధనల ఉల్లంఘన పై చర్యలు తీసుకునేందుకు అధికారులను ఆదేశించాలని స్థానికులు కోరుకుంటున్నారు.






