గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే వేముల

by Elthuri vijay kumar |

నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు

గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే వేముల
X

గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే వేముల

దిశా చిట్యాల : నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు బుధవారం చిట్యాల మండలంలోని సుంకనపల్లి ఏపూర్ చిన్నకాపర్తి గ్రామాలలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవాల కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా పాలనలో భాగంగా గ్రానీ గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. గ్రామాలలో ఉన్నటువంటి రోడ్లు త్రాగునీరు పక్క అంగన్వాడి పాఠశాల భవనాల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం వంటి కార్యక్రమాలపై దృష్టి సారించడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి దోపిడీ వల్లే తెలంగాణ రాష్ట్రం వెనుకబడిందని కానీ ఇప్పుడు అధికారం చేపట్టి రెండేళ్లు కాకముందే అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తున్నామని అన్నారు. దీనికి అన్ని వర్గాల రాష్ట్ర ప్రజల అన్నదండలు ప్రభుత్వానికి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ కాటం వెంకటేశం, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నరసయ్య, గడకారి సైదులు, ఆవుల సుందర్, తదితరులు పాల్గొన్నారు.

Next Story