కోళ్ల ఫారం నిర్మాణాలు చేపట్టొద్దని గ్రామస్తుల ఆందోళన..

by I. Sairam |

మండలంలోని దామర భీమనపల్లి గ్రామ సమీపంలో నిర్మాణం చేస్తున్న కోళ్ల ఫారం నిర్మాణాలను చేపట్టవద్దని కోరుతూ గ్రామస్తులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు.

కోళ్ల ఫారం నిర్మాణాలు చేపట్టొద్దని గ్రామస్తుల ఆందోళన..
X

దిశ, మర్రిగూడ: మండలంలోని దామర భీమనపల్లి గ్రామ సమీపంలో నిర్మాణం చేస్తున్న కోళ్ల ఫారం నిర్మాణాలను చేపట్టవద్దని కోరుతూ గ్రామస్తులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జిల్లా కృష్ణ ఆధ్వర్యంలో గ్రామస్తులు కోళ్ల ఫారం దగ్గర నిరసనకు దిగారు. ఇప్పటికే ఉన్నా లేయర్ కోళ్ల ఫామ్ తో దుర్గంధ వాసన ఈగలతో గ్రామంలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, అనారోగ్యం పాలవుతున్నారని గతంలోనే ఎంపీడీవోకు వినతి పత్రం ఇచ్చామని కానీ యజమాని బెకాతార్ చేస్తూ, అక్రమంగా మళ్లీ కోళ్ల ఫారం నిర్మాణాలను అదనంగా చేపడుతున్నారని, వెంటనే నిలిపివేయాలని కోరుతూ డిమాండ్ చేశారు. నిర్మాణాలను ఆపకపోతే తామే దగ్గరుండి కూల్చివేస్తామని యజమానికి ఫోన్లో హెచ్చరించారు. పర్మిషన్ లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దని ఉన్నతాధికారులకు సైతం తాము ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.

Next Story