ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న వెంకటాపురం సతీష్

by velandi.Saikiran |

బాలాజీనగర్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న పాల్వాయి గ్రామానికి చెందిన వెంకటాపురం సతీష్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న వెంకటాపురం సతీష్
X

దిశ, గుర్రంపోడు: బాలాజీనగర్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న పాల్వాయి గ్రామానికి చెందిన వెంకటాపురం సతీష్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి చేతుల మీదుగా సతీష్ ఘనంగా అవార్డును స్వీకరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సతీష్ మాట్లాడుతూ, “ఈ అవార్డు నా ఒక్కరి కృషి కాదు. పాఠశాల సిబ్బంది సహకారం, విద్యార్థుల కృషి, గ్రామ ప్రజల ప్రోత్సాహం వల్లే సాధ్యమైంది. భవిష్యత్తులో మరింత సేవ చేయడానికి ఇది నాకు ప్రేరణగా నిలుస్తుంది” అని అన్నారు.

Next Story