రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

by Bhanu |

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
X

దిశ, వేములపల్లి : ద్విచక్ర వాహనాన్ని స్కార్పియో వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన వేములపల్లి మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ పట్టణంలోని తాళ్లగడ్డకు చెందిన మందడి గోపాల్ రెడ్డి (47) ద్విచక్ర వాహనంపై నల్గొండ నుండి మిర్యాలగూడ వస్తుండగా మండల కేంద్రంలోని ఓ వీధి నుంచి వస్తున్న స్కార్పియో వాహనం ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో గోపాల్ రెడ్డికి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.



Next Story