అక్కస్సు తోనే ఉపాధి హామీ పథకానికి పేరు మార్పిడి : డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత

by Nallavelli.Anjaneyulu |

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి ఆ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వీబీజీ రామ్ జీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత డిమాండ్ చేశారు.

అక్కస్సు తోనే ఉపాధి హామీ పథకానికి పేరు మార్పిడి : డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత
X

దిశ, నల్గొండ(కనగల్): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి ఆ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వీబీజీ రామ్ జీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండ పట్టణంలోని యాదవ సంఘం భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై ఉన్న అక్కసు తోనే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చిందని ఆయన ఆరోపించారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ ఫోటోను, ఆయన పేరును తొలగించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకంతో దేశంలోని గ్రామీణ పేదలకు సంవత్సరానికి వందరోజుల పని దినాలు లభించే వని చెప్పారు. ఇప్పుడు గ్రామపంచాయతీల నుండి అధికారం పోయి కేంద్ర ప్రభుత్వమే పనులను అప్పగించేలా చట్టాన్ని రూపొందించాలని ఆయన విమర్శించారు. గతంలో కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా కూలీల వేతనాలను చెల్లించేదని ప్రస్తుతం తీసుకొచ్చిన చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వేతనాలను చెల్లించేలా రూపొందించాలని కైలాష్ నేత చెప్పారు. దీనివల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో టిపిసిసి మేనిఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు కన్నారావు, ఎండి ముంతాజ్ అలీ, చింతపల్లి వెంకటయ్య, గౌతమ్, పగిళ్ల శివ, పోలగొని వెంకట్ గౌడ్, శ్రీనివాస్, సిహెచ్. శంకరయ్య, రమేష్, బ్రహ్మదేవర, ముత్యాల ఆంజనేయులు, మజీద్, నాగార్జున గౌడ్ పాల్గొనారు.

Next Story