- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెల్ల దొరలను ఎదురొడ్డి నిలిచిన ధీ శాలి ఓబన్న : మంత్రి ఉత్తమ్
తెల్లదొరలను ఎదురొడ్డి నిలిచిన తొలి తరం స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డెర ఓబన్న అని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు.

దిశ, కోదాడ : తెల్లదొరలను ఎదురొడ్డి నిలిచిన తొలి తరం స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డెర ఓబన్న అని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా వడ్డెర కులస్తులు ఏర్పాటుచేసిన వడ్డెర ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు తమ నాయకుడు రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకే నేడు కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో కులగనన కు ఆమోదముద్ర వేసింది అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై శాసనసభలో మొట్టమొదటిసారిగా చర్చించింది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఈ విషయంలో దేశానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. తాను బీసీ సబ్ కమిటీ చైర్మన్గా బీసీ రిజర్వేషన్ల కోసం కృషి చేశానన్నారు.
కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గం తనకు చేసిన సహాయం మర్చిపోలేనని గుర్తు చేసుకున్నారు కోదాడలో వడ్డెర కులస్తుల స్మశాన వాటికకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు తప్పకుండా వడ్డెర కులస్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఓబన్న విగ్రహం కోదాడలో ఏర్పాటు చేయడం అభినందనీయమని విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన నాయకులు ఒంటి పులి గోపయ్య ఒంటి పులి వెంకటేష్లను అభినందించారు. విగ్రహ దాత వేముల వెంకయ్యను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు ఎమ్మెల్సీ ఏసు రత్నం ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరీ పేటి జైపాల్, వడ్డెర సంఘం జాతీయ నాయకులు కృష్ణయ్య రాష్ట్ర నాయకులు ఒంటి పులి గోపయ్య ఒంటి పులి వెంకటేష్ ,నాయకులు ఒంటి పులి శీను, బత్తుల ఉపేందర్, చింతల నాగేశ్వరరావు, లింగయ్య, బండ్ల దాసు, చింతల నాగేశ్వరరావు తదితరులున్నారు






