అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలి : మంత్రి ఉత్తమ్

by Bhanu |

కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరుగుతున్న అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలి : మంత్రి ఉత్తమ్
X

దిశ హుజూర్ నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరుగుతున్న అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.హుజుర్ నగర్, కోదాడ నియోజకవర్గాలకు చెందిన ప్రజలు ఆర్థిక అభివృద్ధి అభివృద్ధి చెందేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఆదివారం ఉదయం హుజుర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని 231 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ/షాధి ముబారక్ పథకంలో భాగంగా ఆయన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన జీవితాన్ని ప్రజా జీవితానికి అంకితం చేసి నిబద్ధత, నిజాయితీతో పారదర్శకంగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పడుతున్నానని ఆయన అన్నారు.మహిళల జీవితాలలో వెలుగులు నింపడం ప్రభుత్వ సంకల్పమని ఆయన పేర్కొన్నారు.మహిళలను సుసంపన్నం చేసేందుకే వడ్డీలేని రుణాలు అందజేసినట్లు ఆయన తెలిపారు. సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.ఈ ప్రాంత విద్యార్థి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు వీలుగా ఇక్కడ ఐ.టి.ఐ తో పాటు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ను నెలకొల్పినట్లు ఆయన వివరించారు.అంతే గాకుండా ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గాను హుజుర్నగర్ లో 7.50 కోట్ల వ్యయంతో జూనియర్ కళాశాల భవనం,4.50 కోట్లతో డిగ్రీ కళాశాల భవనాలను నిర్మిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.హుజుర్ నగర్, కోదాడ ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకే వేల కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పధకాలను నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


అందుకు గాను త్వరితగతిన భూసేకరణ పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.చివరి అంచు వరకు సాగు నీరు అందించాలని నీటిపారుదల రంగంపై పెట్టె ప్రతి పైసా రైతాంగానికి ఉపయోగపడాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.పెరుగుతున్న రవాణాకు తగిన రీతిలో మారుమూల గ్రామాలలో వందల కోట్లు వెచ్చించి రహదారుల నిర్మాణం చేపట్టామని ఆయన గుర్తు చేశారు.హుజుర్ నగర్ పట్టణంలోనీ రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన 2,000 ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని అధికారులను ఆయన ఆదేశించారు. లబ్ధిదారులంతా హుజూర్ నగర్ పట్టణం మండలానికి చెందిన వారై ఉండాలని ఆయన సూచించారు.అయితే ఇళ్ల కేటాయింపులలో ఎటువంటి వత్తిడికి లొంగొద్దని పూర్తిగా పారదర్శకంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.మిగిలిన మండలాల్లో ఇళ్లు లేని నిరుపేదలకు ఐదు లక్షల రూపాయలు అందించే ప్రక్రియ త్వరలోనే ప్రారంభం అవుతుందని ఆయన ప్రకటించారు. అర్హులైన నిరుపేదలందరికీ ఉచితంగా సన్నబియ్యం అందించడం ఒక చారిత్రాత్మకమైన ఘట్టమని అభివర్ణించాడు.అటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి తాను మంత్రిగా విధులు నిర్వర్తించడం తన పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నాన్నారు.రాష్ట్ర జనాభాలో 84 శాతానికి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేసి పేదోళ్ల జీవితాల్లో వెలుగులు నింపడం మించిన సంక్షేమ పథకం మరోటి ఉండదన్నారు.యావత్ భారతదేశంలో ఈ తరహా కార్యక్రమం ఒక్క తెలంగాణా రాష్ట్రంలోనే అని అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభం కావడం విశేషమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ దేశ్ ముఖ్ రాధిక అరుణ్ కుమార్ ఆర్డీఓ శ్రీనివాసులు తహసిల్దార్లు నాగార్జున రెడ్డి సైదులు జ్యోతి మంగ బండ కవితా సురేందర్ రెడ్డి కమలాకర్ ప్రజా ప్రతినిధులు మాజీ ప్రతినిధులు నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.




Next Story