- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసమర్థత ప్రభుత్వం వల్లే యూరియా కొరత
అధికారంలోకొచ్చి ఏ ఒక్క హామీని అమలుపర్చలేదు: బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్

అసమర్థత ప్రభుత్వం వల్లే యూరియా కొరత
అధికారంలోకొచ్చి ఏ ఒక్క హామీని అమలుపర్చలేదు..
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్
దిశ నేరేడుచర్ల : అవగాహన లేని అసమర్థత పాలన వలనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు .జనాభాలో 70 శాతంగా ఉన్న రైతులకు యూరియా అందక పోవడంతో పిఎసిఎస్ కేంద్రాల వద్ద, డీలర్ల దుకాణాల ఎదుట క్యూలైన్లలో చెప్పులు దర్శనమిస్తున్నాయన్నారు. పైసలిచ్చిన యూరియా దొరకని పరిస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. బుధవారం నేరేడుచర్ల పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.బిఆర్ఎస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఏప్రిల్, మే నెలలోనే ప్రణాళిక బద్దంగా వ్యవహరించి యూరియా సరఫరా చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వానికి రాష్ట్రంలో జిల్లాలో ఎంత యూరియా అవసరమో అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
యూరియా సరఫరా పై వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా మంత్రులు, అధికారుల సమాధానాలకు పొంతన లేకుండా పోయిందన్నారు.రోడ్డు మార్గాన కాకుండా హెలికాప్టర్లలో పర్యటిస్తే రైతుల ప్రజల సమస్యలు మంత్రులకు ఏ విధంగా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. కొద్దో గొప్పో సరఫరా అయ్యే యూరియా కాంగ్రెస్ పార్టీ నాయకుల పైరవీలకే సరిపోవడం లేదని, నల్లగొండ జిల్లాలో ఓ శాసనసభ్యుడి గన్ మెన్ ఏకంగా ఓ లారీ లోడు యూరియా బస్తాలు పక్కదారి పట్టించడం ఇందుకు నిదర్శనమన్నారు. రెండు మూడు రోజుల్లో యూరియా కొరత తీర్చకపోతే రైతుల పక్షాన ఉద్యమాలకు సిద్ధమవుతామన్నారు. ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు, 420 పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటి అమలు పరచలేదని ఆరోపించారు. దేశంలో మావోయిస్టులు ఆయుధాలు వదిలి చర్చలకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో బిజెపి ప్రభుత్వం కక్షపూరిత ధోరణి విడనాడి ప్రశాంత వాతావరణంలో చర్చలు జరిపి దేశ, రాష్ట్రాల అభివృద్ధికి దోహద పడాలన్నారు.






