రైతులకు తప్పని యూరియా తిప్పలు..

by Nalla Sampath Reddy |

వ్యవసాయ పనులు ప్రారంభంతోనే రైతులకు యూరియా కొరత ఏర్పడింది. అధికారులు ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తుంది..

రైతులకు తప్పని యూరియా తిప్పలు..
X

దిశ హుజూర్ నగర్ / నేరేడుచర్ల: వ్యవసాయ పనులు ప్రారంభంతోనే రైతులకు యూరియా కొరత ఏర్పడింది. అధికారులు ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తుంది.. యూరియా కొరత వల్ల రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వర్షాల వలన పంటలు దెబ్బతిన్నాయని యూరియా సకాలంలో లేకపోతే ఎదుగుదల సక్రమంగా ఉండదని ఆందోళన చెందుతున్నారు. యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుండే షాపుల వద్దకు సంఘాల వద్దకు చేరుకొని క్యూలైన్లో నిలబడుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి సంఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పాలకవీడు మండలంలో చోటుచేసుకుంది. నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి పాలకవీడు మండలంలో పాలకవీడు పిఎసిఎస్ వద్దకు యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు శనివారం తెల్లవారుజామున 6 గంటల నుండి సంఘం వద్దకు చేరుకొని యూరియా ‌ కట్టల కోసం క్యూ లైన్‌లో నిలబడి ఉన్నారు. వచ్చిన యూరియా కూడా సక్రమంగా రైతులకు అందించలేదని సంఘం సభ్యులు వారి అనుకూలమైన వారికి మాత్రమే అధికంగా కట్టలు పంపిణీ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వం యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు వేడుకుంటున్నారు.

Next Story