యూరియా బుకింగ్ యాప్ ను రద్దు చేయాలి

by Ratna Kumari |

రైతులను ఇబ్బంది పెడుతున్న యూరియా బుకింగ్ యాప్ ను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ అన్నారు.

యూరియా బుకింగ్ యాప్ ను రద్దు చేయాలి
X

దిశ, భూదాన్ పోచంపల్లి : రైతులను ఇబ్బంది పెడుతున్న యూరియా బుకింగ్ యాప్ ను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని భీమనపల్లి గ్రామంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా బుకింగ్ యాప్ వల్ల రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని, ఓటిపి రాకపోవడం, స్టాక్ ఉన్న చూపించకపోవడం, సాంకేతిక సమస్యల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎకరాకు 15,000 ఇస్తానని చెప్పి మోసం చేసిందని విమర్శించారు. తక్షణమే రైతు భరోసా విధులను వెంటనే విడుదల చేయాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు మంచాల మధు, కలుకూరు బిక్షపతి, బూరుగు బిక్షపతి, ఉప్పునూతల యాదగిరి, చెరుకు చంద్రయ్య పాల్గొన్నారు.

Next Story