భూ నిర్వాసితుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే నేనావ‌త్ బాలు నాయ‌క్

by Nallavelli.Anjaneyulu |

ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితుల సంక్షేమం అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ అన్నారు.

భూ నిర్వాసితుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం :  ఎమ్మెల్యే నేనావ‌త్ బాలు నాయ‌క్
X

దిశ‌, దేవ‌ర‌కొండ టౌన్ : ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితుల సంక్షేమం అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏకేబీఆర్ (AKBR) లిఫ్ట్ ఇరిగేషన్ పైపులైన్ నిర్మాణంలో వ్యవసాయ భూములు కోల్పోయిన 41 మంది రైతులకు నష్టపరిహారం చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ ప్రాజెక్టుల ద్వారా ప్రభావితమైన ప్రజల హక్కులు, జీవనోపాధిని పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. భూ నిర్వాసితుల కష్టాలను పరిష్కరించడంలో ప్రభుత్వం కీలక భూమిక పోషిస్తుందని, వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఏకేబీఆర్ ప్రాజెక్టు రిజర్వాయర్ ముంపు నిర్వాసితులు అధైర్యపడవద్దని, త్వరలోనే వారికి పూర్తిస్థాయిలో పరిహారం అందుతుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కింద అక్కంపల్లి గ్రామానికి చెందిన 41 మంది రైతులు 4.13 ఎకరాల భూమిని కోల్పోగా, వారికి మొత్తం ₹52,39,593/-విలువ గల నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలోని మొత్తం 6691 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో RDO రమణా రెడ్డి, ఇరిగేషన్ శాఖ DE నాగయ్య, AE శిల్పా, నాయకులు తెర సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ పాల్వాయి వెంకట్ రెడ్డి, సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, హరి కిషన్ నాయక్ పాల్గొన్నారు.

Next Story