హార్ట్ ఎటాక్ తో యూపీ కార్మికుడు మృతి

by Elthuri vijay kumar |

ఆదివారం సాయంత్రం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనీ బలియా జిల్లా కస్ కరూర్ తాలూకా కాకర్ ఘాట్ చెందిన వినోద్( 45 )అవాక్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా వచ్చి డెక్కన్ ఫ్యాక్టరీ వెనుక భాగంలో గల లేబర్ కాలనీలో ఉంటూ డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో తను ఉంటున్న కాలనీలో బట్టలు ఉతుకుతుండగా హార్ట్ ఎటాక్ రావడం జరిగిందని తెలిపారు.

హార్ట్ ఎటాక్ తో యూపీ కార్మికుడు మృతి
X

హార్ట్ ఎటాక్ తో యూపీ కార్మికుడు మృతి

డెక్కన్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కూలీ

పోలీసులపై రాళ్లు వేసిన యూపీ కార్మికులు

పోలీస్ వాహనం, ఫ్యాక్టరీ అద్దాలు ధ్వంసం.

దిశ హుజూర్ నగర్ (పాలకవీడు) : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని డెక్కన్ సిమెంట్ పరిశ్రమ వద్ద సోమవారం ఉదయం ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పాలకవీడు ఎస్సై కోటేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి . ఆదివారం సాయంత్రం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనీ బలియా జిల్లా కస్ కరూర్ తాలూకా కాకర్ ఘాట్ చెందిన వినోద్( 45 )అవాక్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా వచ్చి డెక్కన్ ఫ్యాక్టరీ వెనుక భాగంలో గల లేబర్ కాలనీలో ఉంటూ డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో తను ఉంటున్న కాలనీలో బట్టలు ఉతుకుతుండగా హార్ట్ ఎటాక్ రావడం జరిగిందని తెలిపారు. అక్కడ ఉన్నవారు వెంటనే ఆయనను గుర్తించి మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లారని తెలిపారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి ఇతను హార్ట్ ఎటాక్ తో చనిపోయాడని నిర్ధారించారని పేర్కొన్నారు. అతని వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో మృతదేహాన్ని యూపీ వెళ్లాలని తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో డెక్కన్ గేట్ ముందల గొడవ చేస్తున్నట్లు ఫ్యాక్టరీ నుండి మాకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లామని చెప్పారు. అక్కడ ధర్నా అవసరం లేదని మీరు వెళ్లి పని చేసుకోవాలని ..మీలో నలుగురు వస్తే ఫ్యాక్టరీ వాళ్ళతో జరిగిన విషయాన్ని చర్చించి మాట్లాడదాం అని ఎస్సై ప్రయత్నం చేసినా వినకుండా పోలీసులపై మూకుమ్మడిగా రాళ్లతో దాడి చేశారని తెలిపారు. ఈ దాడిలో ఫ్యాక్టరీ సెక్యూరిటీ రూమ్ కి సంబంధించిన అద్దాలను పగలగొట్టారు. అలాగే పోలీసులపై రాళ్లతో సిమెంటు ఇటుకలతో దాడికి పాల్పడ్డారు. పాలకవీడు పోలీస్ స్టేషన్ చెందిన పెట్రోలింగ్ వెహికల్ పై రాళ్లతో దాడి చేయడంతో అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ దాడుల్లో ఎస్సై కోటేష్ తోపాటు కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలయ్యాయ. ప్రస్తుతం ఫ్యాక్టరీ అంతా పోలీస్ అదుపులో ఉంది. పోలీసులపై దాడి చేసిన వ్యక్తులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.

Next Story