గుర్తు తెలియని వ్యక్తి రైలుపై నుండి పడి తీవ్రగాయాలు..

by Bhanu |

గుర్తు తెలియని వ్యక్తి రైలుపై నుండి పడి తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని నాగారం - కమ్మగూడెం గ్రామాల మధ్య ఆదివారం చోటు చేసుకుంది.

గుర్తు తెలియని వ్యక్తి రైలుపై నుండి పడి తీవ్రగాయాలు..
X

దిశ, వలిగొండ: గుర్తు తెలియని వ్యక్తి రైలుపై నుండి పడి తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని నాగారం - కమ్మగూడెం గ్రామాల మధ్య ఆదివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నాగారం- కమ్మగూడెం గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తి రైలుపై నుండి పడి తీవ్రంగా గాయపడినట్లుగా రైల్వే సిబ్బందికి సమాచారం అందింది. ఈ మేరకు ఘటన స్థలానికి రైల్వే సిబ్బంది చేరుకొని తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చౌటుప్పల్108 వాహనంలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.


ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి తలకు, కాలుకు తీవ్రంగా గాయలైనట్లు బాధితుని పూర్తి వివరాలు తెలుపలేక పోతున్నాడని, మహారాష్ట్రలోని ఉదగిర్ గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యక్తినని చెబుతున్నాడని, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై రామకృష్ణ తెలిపారు.

Next Story