ద్విచక్ర వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

by Bhanu |

గుడిపల్లి మండలం చిలకమర్రి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.

ద్విచక్ర వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
X

దిశ, పెద్దఅడిశర్లపల్లి (గుడిపల్లి): గుడిపల్లి మండలం చిలకమర్రి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గుడిపల్లి ఎస్‌ఐ నర్సింలు తెలిపిన వివరాల ప్రకారం – ధనపురం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి ఆంజనేయులు మల్లెపల్లి నుండి అంగడిపేటకు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా, కోదాడ-జడ్చర్ల ప్రధాన రహదారిపై అతివేగంగా వాహనం నడపడం వల్ల సుమారు 30 ఏళ్ల వయసున్న మతిస్థిమితం లేని గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టాడు.

తీవ్ర గాయాలపాలైన బాధితుడిని 108 అంబులెన్స్‌ ద్వారా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై చిలకమర్రి గ్రామ కార్యదర్శి యాద భవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు.

గమనిక: మృతుడి వివరాలు తెలియని పరిస్థితుల్లో, అతని ఆచూకీ గురించి సమాచారం తెలిసిన వారు గుడిపల్లి ఎస్‌ఐ (8712670227), కొండమల్లేపల్లి సీఐ (8712670157), లేదా ఏఎస్పీ దేవరకొండ (8712670207) నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Next Story