- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, నకిరేకల్: నార్కట్‌పల్లి మండలం లోని చిన్న తుమ్మల గూడెం గ్రామానికి చెందిన కౌలు రైతు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న తుమ్మల గూడెం గ్రామానికి చెందిన బాత్తుక రామలింగయ్య(40) వ్యవసాయ పెట్టుబడి కోసం 5 లక్షల రూపాయలు అప్పు చేశాడు. అప్పులు తీర్చడం ఇబ్బంది మారడంతో జనవరి 29వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గమనించిన కుటుంబీకులు వెంటనే చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. దీంతో మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రామకృష్ణ గౌడ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






