ఆర్టీసీ బస్టాండ్ అస్తవ్యస్తం

by Ajay Maddhiboyina |

ఆర్టీసీ అధికారులు, యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా తుంగతుర్తిలోని బస్టాండ్ అధ్వానంగా తయారైంది. బస్టాండ్ ముందుభాగంలో ఏపుగా కంపచెట్లు పెరిగి అది కనిపించకుండా పోయింది. దీంతో కొన్ని బస్సులు లోపలికి రాకుండానే వెళ్తున్నాయి. కొంతకాలంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బస్టాండ్ అంధకారంలో మగ్గుతోంది.

ఆర్టీసీ బస్టాండ్ అస్తవ్యస్తం
X

ఆర్టీసీ అధికారులు, యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా తుంగతుర్తిలోని బస్టాండ్ అధ్వానంగా తయారైంది. బస్టాండ్ ముందుభాగంలో ఏపుగా కంపచెట్లు పెరిగి అది కనిపించకుండా పోయింది. దీంతో కొన్ని బస్సులు లోపలికి రాకుండానే వెళ్తున్నాయి. కొంతకాలంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బస్టాండ్ అంధకారంలో మగ్గుతోంది. కుర్చీలు, గదులు ధ్వంసమయ్యాయి. టాయిలెట్లు కూడా ధ్వంసమై దుర్గంధంతో ఉండడంతో మహిళా ప్రయాణికులు, ఉద్యోగుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. బస్టాండ్ బిచ్చగాళ్లు, మేకలు, విష సర్పాల సంచారానికి నిలయంగా మారింది. దీంతో ప్రయాణికులు రోడ్లపైనే నిలబడాల్సి వస్తోంది. అధికారులకు పరిస్థితి తెలిసినా పట్టించుకోవడం లేదని, తమకు ఆదాయం వస్తే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

- దిశ, తుంగతుర్తి

దిశ, తుంగతుర్తి : సూర్యాపేట ఆర్టీసీ డిపో యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ దారుణంగా మారింది. ‘మా సంస్థకు ఆదాయం వస్తే చాలు, ఎలా ఉంటే మాకేంది?’ అన్నట్టుగా అధికారుల తీరు ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. బస్టాండ్‌ను ప్రయాణికులకు అనుగుణంగా ఉంచడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.

ప్రమాదకరంగా మారిన బస్టాండ్...

గతంలో పరిశుభ్రతకు ఒక కంట్రోలర్ ఉండేవారు. కానీ, ఇప్పుడు వారిని తొలగించడంతో బస్టాండ్ ఆలనాపాలన కరువైంది. బస్టాండ్ ముందు భాగంలో ఏపుగా కంపచెట్లు పెరిగాయి. దీంతో బస్టాండ్ కనిపించని రీతిగా మారింది. దీంతో కొన్ని బస్సులు లోపలికి రాకుండానే వెళ్లిపోతున్నాయి. గత కొంతకాలంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రాత్రి అయితే చాలు బస్టాండ్ అంధకారంలో మగ్గుతోంది. ప్రయాణికుల కుర్చీలు, లోపలి గదులు ధ్వంసమయ్యాయి. బస్టాండ్ బిచ్చగాళ్లకు, మేకలు, గొర్రెలు, క్రిమికీటకాలకు నివాసంగా మారింది. ప్రయాణికులు ఎండ, వానలకు రోడ్లపైనే నిలబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. హైదరాబాద్, యాదగిరిగుట్ట, సూర్యాపేట, మహబూబాబాద్ డిపోలకు చెందిన బస్సులు ఇక్కడి నుంచే నడుస్తుండడంతో ప్రయాణికులు నరకాన్ని చూస్తున్నారు.

ధ్వంసమైన టాయిలెట్లు, దుర్వాసన..

బస్టాండ్ ఆవరణలోని టాయిలెట్లు కూడా ధ్వంసమై దుర్గంధంతో భయంకరంగా మారాయి. దీంతో మహిళా ప్రయాణికులతోపాటు ఆర్టీసీ మహిళా ఉద్యోగుల పరిస్థితి కూడా దారుణంగా మారింది. పరిసరాలు చెట్లు, చేమలతో నిండి విష సర్పాల సంచారానికి నిలయంగా మారాయి. బస్టాండ్ పరిస్థితులు అధికారులకు తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తనిఖీలు చేసినప్పుడు మెరుగుపరుస్తామని చెప్పి వెళ్లడమే తప్ప ఆచరణలో శూన్యమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

Next Story