సొంతూరు అభివృద్ధికి కృషి చేస్తా : త్రిపుర గవర్నర్

by Batti.Sumithra |

గానుగుబండ గవర్నర్ ఇంద్రసేనారెడ్డిది సొంతూరు కాగా గ్రామానికి చెందిన పలువురు శనివారం హైదరాబాద్ లోని లోక్ భవన్ ఆయనను కలిసి గ్రామ సమస్యలు చెప్పుకొచ్చారు.

సొంతూరు అభివృద్ధికి కృషి చేస్తా : త్రిపుర గవర్నర్
X

దిశ, తుంగతుర్తి : తన సొంతూరు అభివృద్ధికి కృషి చేస్తానని త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగుబండ గవర్నర్ ఇంద్రసేనారెడ్డిది సొంతూరు కాగా గ్రామానికి చెందిన పలువురు శనివారం హైదరాబాద్ లోని లోక్ భవన్ ఆయనను కలిసి గ్రామ సమస్యలు చెప్పుకొచ్చారు. గ్రామంలో తమకు (ఇంద్రసేనారెడ్డి సోదరులు) చెందిన 22 గుంటల భూమిని ఉచితంగా ఇస్తే గ్రామపంచాయతీ భవనంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల భవన నిర్మాణాలు చేపట్టడమో లేదా ఫంక్షన్ హాల్ నిర్మాణం చేస్తామని వారు వివరించారు. అలాగే కర్విరాల నుండి గానుగుబండ మీదుగా వెంపటి గ్రామం వరకు థార్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరి చేయాలని కోరారు. అలాగే సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.50 లక్షలు, నిరుపేదలకు 50 గృహాలు మంజూరి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. తన సోదరులతో సంప్రదించి భూమిని ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామాభివృద్ధికి వివిధ పథకాల మంజూరికి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని తెలిపారు. అంతకు ముందు గవర్నర్ ను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. వచ్చిన వారిని గవర్నర్ ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాతంగి వెంకటమ్మ కర్ణాకర్, మాజీ ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్, మాజీ సర్పంచ్ నల్లు రాంచంద్రారెడ్డి, వార్డు సభ్యులు ఆశాలు, వెలిసాల వెంకన్న, మాజీ ఎంపీటీసీ దుర్గయ్య, సింగల్ విండో డైరెక్టర్ కుశలవరెడ్డి, యనగందుల రాంచంద్రయ్య, పోలేపాక సోమయ్య, పోలేపాక రవి, పంజాల సతీష్, భూపతి సైదులు, పోలేపాక సతీష్, అబ్బగాని రవి, వై.రమేష్, సతీష్, నల్లు అశోక్ రెడ్డి, నల్లు చిత్తరంజన్ రెడ్డి, బీంరెడ్డి దయాకర్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, కంచర్ల సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Next Story