నార్మల్ డెలివరీ అని నిర్లక్యంతో వైద్యం.. బాలుడు మృతి

by Bhanu |

గుడిపల్లి మండలం కి చెందిన కేషనేనిపల్లి తండా చెందిన జటోతూ ఝాన్సీ ఈనెల 6న 8 నెలల గర్భం తో ఆసుపత్రికి వచ్చింది. ఆమెను పరిశీలించి న డాక్టర్లు వార్డులో ఉంచారు. ఆమెకు కొంత కడుపునొప్పి తీవ్ర తరం అవ్వడంతో నిన్న సాయంత్రం డెలివరీ చేయగా బాబు పుట్టి చనిపోయాడు.

నార్మల్ డెలివరీ అని నిర్లక్యంతో వైద్యం.. బాలుడు మృతి
X

దిశ, నల్లగొండ: గుడిపల్లి మండలం కి చెందిన కేషనేనిపల్లి తండా చెందిన జటోతూ ఝాన్సీ ఈనెల 6న 8 నెలల గర్భం తో ఆసుపత్రికి వచ్చింది. ఆమెను పరిశీలించి న డాక్టర్లు వార్డులో ఉంచారు. ఆమెకు కొంత కడుపునొప్పి తీవ్ర తరం అవ్వడంతో నిన్న సాయంత్రం డెలివరీ చేయగా బాబు పుట్టి చనిపోయాడు. బాలింతగా ఉన్న ఝాన్సీకి అనారోగ్యం విషమించడంతో తల్లిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమె తరుపున బంధువులు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి డాక్టర్ల నిర్లక్ష్యం అని లంబడా హక్కుల నాయకులు పెద్ద ఎత్తున అక్కడకి చేరుకొని కలెక్టర్ వచ్చే వరకు మేము కదలము అని జిల్లా వైద్య అధికారిని అలాగే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ని తక్షణం సస్పెన్షన్ చేయాలని డిమాండ్ చేశారు.

గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ నల్లగొండలో అధికార యంత్రంగం జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ చీమ కుట్టినట్లు కూడా వ్యవహరించడం లేదు అని రాష్ట్ర స్పెషల్ బ్రాంచ్ వాళ్ళకి తెలిపినట్లు, అవసరం అయితే జిల్లా కలెక్టర్ కార్యాలయం కి జిల్లా ఎస్పీ కార్యాలయం కి కూడా తాళం వేస్తాం అని హెచ్చరించారు. అలాగే బాబు కుటుంబానికి మూడు ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం, ఒక కోటి నగదు ఇవ్వాలని తక్షణమే ఆ వైద్యులు ను విధుల నుండి తీసివేయాలని అట్రాసిటీ కేసు నమోదు చేసి మాకు కాపీ ఇస్తేనే ఇక్కడ నుండి లేస్తాము అని డిమాండ్ చేస్తున్నారు.

సంఘటన దురదృష్టకరం: ఆర్డీవో అశోక్ రెడ్డి

ఆసుపత్రికి చేరుకున్న ఆర్డీవో బాధిత కుటుంబాలతో, గిరిజన నాయకులతో మాట్లాడారు సంఘటన దురదృష్టకరం అని అన్నారు.. మీ డిమాండ్లు మాకు తెలుపండి ని వారు అడిగారు అలాగే మీ సమస్య పరిష్కారం దిశగా పని చేద్దాం అని డిమాండ్స్ ని పేపరు రూపంలో రాయండి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అన్నారు. ఈ విషయం కలెక్టర్ స్థాయిలో ఉంది అని అన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు 25 వేలు నేను తక్షణ సహాయం చేస్తా అని అన్నారు. బాధితుల డిమాండ్లు కలెక్టర్ తో మాట్లాతానని తెలిపారు.


Next Story